Praja Kshetram
తెలంగాణ

మోకిలా తండా కేతావత్ లింబియా నాయక్ అంగన్వాడీ విద్యార్థులకు దుస్తులు పంపిణీ

మోకిలా తండా కేతావత్ లింబియా నాయక్ అంగన్వాడీ విద్యార్థులకు దుస్తులు పంపిణీ

 

-అంగన్వాడీ చిన్నారులకు క్రీడా దుస్తులు, పలకలు అందజేత.

-లింబియా నాయక్ ను అభినందిస్తున్న గ్రామ ప్రజలు.

శంకర్ పల్లి అక్టోబర్ 18(ప్రజాక్షేత్రం):సాధారణంగా దాతలు ప్రాథమిక లేదా ఉన్నత పాఠశాలలకు తమ వంతుగా చేయూతనందిస్తూ, అంగన్వాడి చిన్నారులను మరిచిపోతుంటారు కానీ మోకిలా తండా యువజన నాయకుడు లింబియా నాయక్ సరికొత్త ఆలోచనతో మోకిలా తండా లోని అంగన్వాడీ చిన్నారులకు క్రీడా దుస్తులు మరియు పలకలు అందజేసి ఆ చిన్నారుల కళ్ళలో ఆనందం నింపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలకు అంగన్వాడి బాల, బాలికలకు కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చడంలో నేనెప్పుడు ముందుంటానని తెలియజేశారు. అంగన్వాడి చిన్నారులకు పాఠశాల పైన మక్కువ పెరిగే విధంగా అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వివిధ రకాల క్రీడలు నిర్వహిస్తూ, పాటలు పాడిస్తూ హుషారుగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. చిన్నారులకు సరైన పోషక ఆహారం అందించడం వలన మానసికంగా శారీరకంగా దృఢంగా ఎదుగుతారని ఈ విషయంలో టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు అంగన్వాడీ చిన్నారులకు నా వంతు చేయూత నందిచడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేశారు. ఈ సందర్భంగా లింబియా నాయక్ చేస్తున్న సేవలను గ్రామ ప్రజలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, ఉపాధ్యాయులు శివకుమార్ భక్తప్ప, అంగన్వాడి ఉపాధ్యాయురాలు మంగమ్మ, శీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts