మాదిగలు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందాలి
-ఎం ఐ సి సి ఐ ప్రెసిడెంట్ సుంచు రాజ్ కుమార్.
సంగారెడ్డి అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం): శనివారం సంగారెడ్డిలో జరిగిన జిల్లా స్థాయి పారిశ్రామిక అవగాహన సదస్సులో ఎం ఐ సి సి ఐ ప్రెసిడెంట్ సుంచు రాజ్ కుమార్ మాట్లాడుతూ మాదిగలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అని ఆర్థికంగా ఎంతో వెనకబడివున్నా మాదిగలు ఎం ఐ సి సి ఐ సంస్థను ఉపయోగించుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలి అని తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ దళిత గిరిజనులు పరిశ్రమలు స్థాపించుటకు జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయం తీసుకోవాలి అని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ఎక్స్యూటివ్ డైరెక్టర్ రామ చారీ మాట్లాడుతూ కార్పొరేషన్ లోన్స్ తీసుకొనుటకు తమను సంప్రదించాలి అని తెలిపారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎం ఎస్ ఎం ఇ యుసుపు యూసఫ్ గూడ, హైదరాబాద్ నుండి కోటేశ్వర రావు వివిధ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల పథకాల గురించి సవివరంగా వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బక్క నరసింహ, కోశాధికారి ఉట్కురి సత్యేంద్ర కుమార్, ఉపాధ్యక్షులు అవునూరి సుధాకర్, పొట్ట మాధవి ఆర్గనైజేషన్ సెక్రటరీ కక్కెరావాడ శ్రీనివాస్, ఎస్క్యూటివ్ మెంబెర్స్ భాస్కర్, గుమ్మడి సతీష్, అనిల్, ఒగ్గు నగేష్ మరియు సంగారెడ్డి జిల్లా ప్రతినిధులు కాశపాగ ఇమ్మయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మనిటరింగ్ సభ్యులు, రాయకోటి నరసింహ వివిధ రంగాలకు చెందిన మాదిగ పారిశ్రామికవేత్తలు మైనంపల్లి కిషన్, పల్లె కిష్టయ్య లక్ష్మన్న గారి వేణు, వినోద్ కుమార్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.