Praja Kshetram
తెలంగాణ

ప్రజా భవన్ సమీపంలో కారు బోల్తా

ప్రజా భవన్ సమీపంలో కారు బోల్తా

 

హైదరాబాద్ అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం): పంజాగుట్ట ప్రజా భవన్ సమీపంలో శనివారం ఉదయం కారు అదుపు తప్పి బోల్తా పడటంతో యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సమీపంలోని వాహనదారులు షాక్‌కు గురయ్యారు. కారు పంజాగుట్ట నుంచి అమీర్ పేట్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రహదారిపై కంకరరాళ్ల వల్లే అదుపుతప్పినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. వాహనం అదుపు తప్పి బోల్తా పడి రోడ్డు ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే కారులో చిక్కుకున్న యువకులను వెలికితీసి అత్యవసర వైద్యం కోసం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts