12 ఏళ్లుగా మహిళా కడుపులో కత్తెర!
హైదరాబాద్:అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం):ఓ మహిళ కడుపులో గత 12 ఏళ్లుగా కత్తెర ఉంది దాదాపు ఆమె పది సంవ త్సరాలుగా కడుపులో నొప్పితో బాధపడుతూనే ఉంది, 12 సంవత్సరా లుగా డాక్టర్లు ఆమె కడుపులో కత్తెర ఉందన్న విషయము కనిపెట్టలేక పోయారు. కడుపునొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన ఒక 45 ఏళ్ల మహిళకు డాక్టర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఎక్స్‌రే తీసి చూసి ఆమె పొట్టలో కత్తెర ఉన్నట్లు తెలిపారు. ఒకరకంగా ఇది పేషెంట్‌కి, ఆమె కుటుంబ సభ్యులకే కాదు.. ఆ హాస్పిటల్ డాక్టర్లకు సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. సిక్కింలో 12 ఏళ్ల క్రితం అపెండిసైటిస్ నొప్పితో బాధపడుతున్న ఓ మహిళ వైద్యం కోసం గ్యాంగ్‌టక్ లోని సర్ తుటోబ్ న్యామ్‌గల్ మెమోరియల్ హాస్పిటల్‌కి వెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆమెకు అపెండిసైటిస్ సర్జరీ చేశారు. డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చి నా ఆమెకు కడుపులో నొప్పి తగ్గలేదు. ఆ తరువాత కడుపు నొప్పికి పరిష్కారం కోసం ఆమె ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో చేసేదేం లేక ఇటీవల, అంటే అక్టోబర్ 8న ఆమె మరోసారి తనకు అప్పట్లో అపెండిసైటిస్ సర్జరీ చేసిన ఎస్టీఎన్ఎం హాస్పిటల్‌కి వెళ్లారు.