హెచ్.పి.సి.ఎల్ ఇంధనం లాయల్టీ పాయింట్ల ద్వారా జీవీఎంసీకి 39.19 లక్షల ఆదాయం
జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్
విశాఖపట్నం, అక్టోబర్ 21(ప్రజాక్షేత్రం):మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ వాహనాలకు హెచ్.పి.సి.ఎల్ ఇంధనం వినియోగించడం ద్వారా జీవీఎంసీ కి 39.19 లక్షల రూపాయలు లాయల్టీ పాయింట్ల ద్వారా ఆదాయం లభించిందని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో హెచ్.పి.సి.ఎల్ లాయల్టీ పాయింట్ల ద్వారా జీవీఎంసీ కి చేకూరిన 39.19 లక్షల చెక్కును హెచ్.పి.సి.ఎల్ రీజనల్ మేనేజర్ బి.రవికాంత్ నుండి కమిషనర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ మెకానికల్ విభాగం ద్వారా జీవీఎంసీ కి చెందిన అన్ని వాహనాలకు హెచ్.పి.సి.ఎల్ ఇంధనం వినియోగించడం ద్వారా 39.19 లక్షల రూపాయలు జీవీఎంసీ కి ఆదాయం లభించిందని , విశాఖ నగరంలోనే హెచ్పిసిఎల్ ఇంధనం సరఫరా చేయు పరిశ్రమలు, సంస్థలలో జీవీఎంసీ ప్రథమ స్థానంలో ఉండటమే కాకుండా 3 సంవత్సరముల కాలానికి గానూ అత్యధిక లాయల్టీ పాయింట్లను జీవీఎంసీ పొందడం ద్వారా ఈ ఆదాయం జీవీఎంసీ కి చేకూరిందన్నారు.