స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా కు స్పోర్ట్స్ డ్రెస్ స్పాన్సర్ చేసిన పట్లోళ్ల నరసింహారెడ్డి
శంకర్ పల్లి, అక్టోబర్ 22(ప్రజాక్షేత్రం):68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా రంగారెడ్డి జిల్లా కు ఇంటర్ జోనల్ స్థాయి క్రీడా విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ స్పాన్సర్ చేసిన రిటైర్డ్ విఆర్ఓ పట్లోళ్ల నరసింహారెడ్డి మంగళవారం మోకిలా క్రీడా ప్రాంగణంలో జరిగిన వాలీబాల్ క్రీడా పోటీలలో విద్యార్థి విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఇలాంటి క్రీడా పోటీలలో పాల్గొన్న విద్యార్థి విద్యార్థులకు స్పాన్సర్ గా నిలుస్తానని ఆయన అన్నారు. చదువుతోపాటు క్రీడల్లో మరింత రాణించాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడలు అనేది మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం అన్నారు. ఓటమి గెలుపులు సహజమే, నేడు ఓటేమి అయితే రేపు గెలుపుకు నాంది అని విద్యార్థులకు తెలియజేశారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలలో నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు.