Praja Kshetram
సినిమా న్యూస్

రామ్ చరణ్ రోల్స్ రాయిస్ కారు నెంబర్ ఇదే

రామ్ చరణ్ రోల్స్ రాయిస్ కారు నెంబర్ ఇదే

 

హైదరాబాద్ అక్టోబర్ 22(ప్రజాక్షేత్రం):మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు. ఆ కారుకు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా.. రవాణాశాఖ టీజీ 09సీ2727 నెంబర్‌ను కేటాయించింది. ఆ వాహనం రిజిస్ట్రేషన్ కోసం మంగళవారం ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ సెంట్రల్ జోన్ ఆఫీసుకు వచ్చారు. ఆయన రాకతో ఆఫీసులో సందడి నెలకొంది. అభిమానులు సెల్ఫీలు దిగారు. రవాణాశాఖ అధికారులు, సిబ్బంది సైతం కలిశారు. ఫొటోలు దిగారు. వాహన రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో వెళ్లిపోయారు. కలిసినవారిలో జాయింట్ ట్రాన్స్ ఫోర్టు కమిషనర్ రమేష్, ఆర్టీఓలు రవీందర్ కుమార్ గౌడ్, పురుషోత్తంరెడ్డి తదితరులున్నారు.

Related posts