ఈడీ విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి …
హైదరాబాద్ అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా పని చేసిన అమోయ్ కుమార్ పై రూ.వందల కోట్ల విలువైన 42 ఎకరాలను అక్రమంగా బదిలీ చేశారని ఆరోపణలున్నాయి. మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీపై ఈడీ విచారణ చేపట్టింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన పాత్రపై నిజానిజాలను తేల్చేందుకు విచారణకు హాజరుకావాలని ఈడీ ఇటీవల నోటీసులు ఇచ్చింది. ఆయన మీడియా కంటపడకుండా ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.