పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. 39 మంది టిజిఎస్పి సిబ్బంది సస్పెండ్..
హైదరాబాద్ అక్టోబర్ 27 ప్రజాక్షేత్రం): తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 39 మంది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని 39 మంది టీజీఎస్పీ సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అందులో వివిధ బెటాలియన్లకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. టీజీఎస్పీ బెటాలియన్లలో ఆందోళనలకు నేతృత్వం వహించిన, ఇంటర్వ్యూలు ఇచ్చినవారిని గుర్తించి.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. అంతకుముందు టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనలపై డీజీపీ జితేందర్ ప్రకటన విడుదల చేశారు.