20 రోజుల్లో మూడు ఆపరేషన్ లు..
– ప్రాణాపాయ స్థితిలో మహిళ
– హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
– రంగం లోకి దిగిన వైద్య అధికారుల బృందం
మంచిర్యాల నవంబర్ 08 (ప్రజాక్షేత్రం):20 రోజుల్లో మూడు ఆపరేషన్ లు చేయడంతో మహిళ ప్రాణ పాయ స్థితిలోకి చేరింది. గమనించిన వైద్యులు హైదరాబాద్ కు రిఫర్ చేయడంతో హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యులు గురువారం అర్థరాత్రి ఆందోళనకు దిగారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి చెందిన శివిని ఆమని 42 కు కడుపు నొప్పి రావడం తో భర్త మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్ లో అక్టోబర్ 15 న తీసుకోచ్చారు. పరీక్షించిన వైద్యులు కడుపులో గడ్డలు ఉన్నాయని సర్జరీ చేయాలనీ తెలిపారు.కుటుంబ సభ్యుల అంగీకారం తో పేషెంట్ ను హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకొని సర్జరీ చేసిన గడ్డలు తొలగించిన రెండు రోజుల తరువాత,కడుపులో పేగులకు ఇన్ఫెక్షన్ అయిందని మరొక సర్జరీ చేసినట్లు ఆమని భర్త పేర్కొన్నారు.మరో రెండు రోజుల అనంతరం కడుపులో చీము వచ్చిందని మరో సర్జరీ చేయాల్సి ఉందని వరుసగా మూడు సర్జరీ లు చేశరని. మూడు సర్జరీ ల అనంతరం కోలుకున్నా ఆమని కి ఉన్నట్టుండి కిడ్నీ లు ఫైల్ అయ్యాయని డయాలసిస్ చేయాల్సి ఉందని చెప్పి రెండు రోజులు డయాలసిస్ చేసి పరిస్థితి విషమంగా ఉంధని హైదరాబాద్ కు రిఫర్ చేశారంటు ఆమని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు.25 రోజులుగా హాస్పిటల్ లో ఉంచుకొని మూడు సర్జరీ లు చేశారని, 10 లక్షల బిల్ అయిందని 4 లక్షలు అమౌంట్ కట్టినాము ఇంకా 6 లక్షలు కట్టాల్సి ఉంధని హాస్పిటల్ సిబ్బంది బిల్ కట్టి పేషెంట్ ను తీసుకెళ్లమంటున్నారని, నడుచుకుంటూ హాస్పిటల్ కు వచ్చిన నా భార్య ను ప్రాణాపాయ స్థితిలోకి తీసుకోచ్చి చేతులు దులుపుకోవాలి హాస్పిటల్ సిబ్బంది చూస్తున్నట్లు బాధితుడు వాపోయాడు. సమాచారం అందుకున్న జిల్లా వైద్య అధికారి శుక్రవారం ప్రత్యేక కమిటీ తో టచ్ హాస్పిటల్ లో ఉన్న రోగి పరిస్థితి, రోగి కి సంబంధించిన కె షీట్ వివరాలు సేకరిస్తున్నారు. మూడు రోజుల్లో విచారణ చెపట్టి వివరాలు తెలియజెస్తామని జిల్లా వైద్య అధికారి హరీష్ రాజ్ పేర్కొన్నారు.జరిగిన విషయం పై హాస్పిటల్ సిబ్బంది ని వివరణ కోరగ విచారణ కొనసాగుతుందని పూర్తి వివరాలు మాక్కూడా తెలియదని బదులు ఇచ్చారు.