Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో భారీ వర్షాల సూచన

ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో భారీ వర్షాల సూచన

 

అమరావతి నవంబర్ 13 (ప్రజాక్షేత్రం):నైరుతి బంగాళాఖతంలో అల్పపీడనం కొనసాగు తోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం తోడవ్వటంతో బలహీనపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అల్పపీడనం మరో రెండు రోజుల్లో తమిళనాడుకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిలాల్లో కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిలాల్లో భారీ వర్షాలు కురిస్తాయని IMD వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు గరిష్టంగా 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దక్షిణ కోస్తా తీరంలో మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

Related posts