Praja Kshetram
తెలంగాణ

కాసాల శివారిలో కళ్ళు దుకాణాన్ని ధ్వంసం చేసిన దౌల్తాబాద్ గౌడ సంఘం నాయకులు                                                 

కాసాల శివారిలో కళ్ళు దుకాణాన్ని ధ్వంసం చేసిన దౌల్తాబాద్ గౌడ సంఘం నాయకులు

 

-దుకాణం కావాలా నీ ప్రాణం కావాలా దౌల్తాబాద్ గౌడ్స్ బెదిరింపులు

సంగారెడ్డి జిల్లా నవంబర్ 14 (ప్రజాక్షేత్రం):సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో శివారులో కాసాల గ్రామస్తుడైన బాన్సువాడ లక్ష్మీనారాయణ గౌడ్ అనే వ్యక్తి కళ్ళు దుకాణం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించామని ఆయన తెలిపారు తన కళ్ళు దుకాణంపై దౌల్తాబాద్ గౌడ సంఘం దుండగులు తన దుకాణాన్ని ధ్వంసం చేసి తనపై దురుసుగా మాట్లాడుతూ అనేక బూతు మాటలతో తిడుతూ దుకాణం కావాలా నీ ప్రాణం కావాలా అని బెదిరిస్తూ తన దుకాణాన్ని ధ్వంసం చేశారు వీళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని హత్నూర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాది ఇవ్వడం కూడా జరిగిందని తెలిపారు. దుకాణానికి ఎక్సైజ్ ఆఫీసర్ లే స్థలాన్ని చూయించి పర్మిషన్ ఇచ్చారని బాన్సువాడ లక్ష్మీనారాయణ గౌడ్ తెలిపారు.

Related posts