శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన కౌన్సిలర్ సంధ్యారాణి అశోక్ కుమార్
శంకర్ పల్లి నవంబర్ 15(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపల్ పరిధి రెండవ వార్డు గణేష్ నగర్ కాలనీలో పోచమ్మ దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు కౌన్సిలర్ సంధ్యారాణి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేకువ జామున మహిళలు తమ తమ కుటుంబ సభ్యులతో ఆలయానికి వచ్చి ప్రత్యేకంగా దీపాలు వెలిగించి శివాలయంలో శివునికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ పట్టణ, వార్డు ప్రజలు సుఖ సంతోషాలతో, ఆనందాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుడిని కోరుకున్నట్టు పేర్కొన్నారు. కాలనీవాసులు పాల్గొన్నారు.