Praja Kshetram
తెలంగాణ

అభివృద్ధికి నోచుకోని వెంకటాపూర్ తండా  

అభివృద్ధికి నోచుకోని వెంకటాపూర్ తండా

-పట్టించుకోని మున్సిపల్ అధికారులు

-కన్నెత్తి చూడని వార్డు కౌన్సిలర్

వికారాబాద్ నవంబర్ 16(ప్రజాక్షేత్రం):వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ తాండ 6వ వార్డు లోని ఒక సంవత్సర నుండి భగీరథ మంచి నీళ్ళు రాకపోవడం లేదు రెండు వీధుల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది. పడుతున్నారు మరుగుదొడ్లు వాసన కంపు భరించలేక రోగాలు వచ్చి హాస్పిటల్ పాలయ్యారు. డ్రైనేజ్ మాన్యువల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి రాకపోకలకు తీరా అంతరాయం కలుగుతుంది. ఎంత చెప్పినా లబోదిబో మొత్తుకున్న మున్సిపల్ అధికారులకు వాడు కౌన్సిలర్ కు చెప్పిన దున్నపోతు మీద వర్షం పడ్డట్టు మాదిరిగా వివరిస్తున్నారు.  బాగు చేయమని ప్రశ్నించగా మున్సిపల్ అధికారులు వెంకటాపూర్ తండా 6వ వార్డ్ కౌన్సిలర్ ప్రశ్నించే వ్యక్తులపై బెదిరింపులకు గురి చేస్తున్నారు. పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వెంకటాపూర్ తండా కి ఒకసారి వచ్చి ప్రజల సమస్య తెలుసుకోండి రోడ్లు విధి లైట్ డైనేజి సమస్య వలన వెంకటాపూర్ తాండ పరిస్థితి ఇబ్బందులు పడుతున్నారు ఇకనుంచి నైనా అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామానికి పర్యటించి ప్రజా సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తున్నాను.. వెంకటపూడు తండా శ్రీనివాస్ నాయక్, బాధితులు తదితరులు పాల్గొన్నారు.

Related posts