రేపు బీసీ రణభేరి మహాసభ
-జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య వెల్లడించారు.
హైదరాబాద్ నవంబర్ 24(ప్రజాక్షేత్రం):సోమవారం బీసీ రణభేరి మహాసభ నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని.. ఇందుకోసం రేపటి నుంచి జరగనున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. బీసీలకు కేంద్రస్థాయిలో ఒక్క స్కీమ్ కూడా లేదని, దశాబ్దాలుగా ఈ వివక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు. రేపు జరగబోయే రణభేరి సభకు అఖిలపక్ష నేతలు అంతా వస్తున్నారని కృష్ణయ్య తెలియ జేశారు.
