Praja Kshetram
తెలంగాణ

విశ్వర్షి వాసిలి వాజ్గ్మయంపై పెనుగొండలో అంతర్జాతీయ సదస్సు

విశ్వర్షి వాసిలి వాజ్గ్మయంపై పెనుగొండలో అంతర్జాతీయ సదస్సు

 

 

హైదరాబాద్ నవంబర్ 26(ప్రజాక్షేత్రం):

 

2 వ భాగం

(కొనసాగుతుంది.)

‘విశ్వర్షి’గా పేరుపొందిన డా.‌ వాసిలి వసంతకుమార్ గారు తన కలం నుండి తెలుగు సాహిత్యంలో ఆణిముత్యాల లాంటి 61 పుస్తకాలను సాహిత్య లోకానికి అందించారు .ఈ పుస్తకాలన్నింటిపై సమగ్ర పరిశోధన పత్రాలు వెలువడనున్నాయి. అందుకు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఎస్. వి . కె. పి.ఎస్. అనగా డాక్టర్ కె.ఎస్. రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా నిలవనుంది. నవంబర్ 27, 28 తేదీలలో జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, సాహిత్య అభిమానులు, సాహిత్య ప్రియులు, పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు, ఆచార్య బృందం, ప్రపంచం నలుమూలల నుండి హాజరు కానున్నారు. విశ్వర్షి వాసిలీ గారు సదస్సు యొక్క ఉద్దేశాన్ని వివరిస్తూ అంతర్జాతీయ సదస్సుకు సంబంధించి దాదాపు ఇప్పటివరకు వందకు పైగా పరిశోధక పత్రాలు వచ్చాయి. వీటన్నింటినీ యు.జి.సి కేర్ జర్నల్ అయిన మూసి మాస పత్రికలో ప్రచురిస్తాం. సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం సాహిత్య విలువలతో కూడుకొని ఉంటుంది. సదస్సు అనగానే ఈ మధ్యకాలంలో వస్తుప్రధానం, విషయప్రధానం అయిపోయింది. కానీ సదస్సులలో ఎక్కడ కూడా సాహిత్య విలువలు లేకుండా పోతున్నాయి. ఆ సాహిత్య విలువలను నేటి సమాజానికి పరిచయం చేయడం ఈ సదస్సు యొక్క లక్ష్యం అంటారు ఆయన. నేను రాసిన 61 పుస్తకాలలో శీర్షిక, శైలి, శిల్పం, వచనం, వ్యక్తిత్వ వికాసం, ధ్యాన యోగం సాధన, మనస్తత్వ చిత్రణ, సామాజిక ఇతివృత్తాలు, సాంఘిక దురాచారాలు, సాంఘిక సంస్కరణలు, ముఖ్యంగా సంఘజీవనం, సభ్య సమాజం, ఆరోగ్యం, పెళ్లి, సంసారం, లాంటివన్నీ నేను సృష్టించిన సాహిత్య సృజనలో కనిపిస్తూ ఉంటాయి. ఈ పుస్తకాలను చదివిన ఎవరైనా కూడా విశ్వర్షి వాసిలి వసంతకుమార్ లాగా వ్యక్తిత్వ సంపన్నులు కాగలుగుతారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, సాహిత్య సృజన చేస్తూ, ఎలాంటి ప్రభుత్వ పురస్కారాలకోసం‌ అంగలార్చకుండా, నికార్సయిన సాహిత్య వేత్తగా

ఎదిగిన వైనం భావి సాహితి వేత్తలకు ఎందరికో ఆదర్శప్రాయం. ఏ రంగంలో అయినా మిత్రులు ఉంటారు, ప్రత్యర్థులు ఉంటారు, శత్రువులు ఉంటారు, ఆయన ప్రతిభే ఆయనను ఈర్ష్యకు గురి చేసేలా చేసి విశ్వవిద్యాలయాలలోకి అడుగుపెట్టకుండ చేసింది అంటారు వారిని గురించి తెలిసిన ప్రముఖులు. విశ్వవిద్యాలయ స్థాయి ఆచార్యుల కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులను ఆయన సాహిత్యం ద్వారా సంపాదించారు.

ఆయనను చూస్తే నడయాడే సాహితీ ఎన్సైక్లోపీడియా అని అనక తప్పదు. అంత గొప్ప ప్రతిభా సంపన్నుడు, భాషాభిమాని, భాషావేత్త, యోగ శాస్త్రవేత్త, విశ్వ గురువు. ఆయన భారతదేశానికి లభించిన మరో విశ్వ ఋషి. ఈయన సాహిత్యాన్ని పరిశోధిస్తున్న నాకే ఈ భావన కలుగుతుంటే ఆయన సృష్టించిన సాహిత్య సృజన ఎలా ఉంటుందో పాఠకులుగా మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అంతర్జాతీయ సదస్సు జరిగే పెనుగొండ ఈ విశ్వర్షి సాహిత్యంతో రెండు రోజులపాటు ఓలాలాడనుంది.

* అంతర్జాతీయ సదస్సు జరిగే పెనుగొండ లోని ఎస్.వి. కె.పి.ఎస్ కళాశాల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తుంది. ఈ విశ్వవిద్యాలయం. 2006వ సంవత్సరంలో ప్రారంభమై 16 సంవత్సరాలుగా ఉభయగోదావరి జిల్లాలలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుంది. ఈ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ 2011 వ సంవత్సరంలో ప్రారంభమైంది. నాటి నుండి నేటి వరకు విద్యార్థులకు ఉత్తమ విద్యనందిస్తుంది. ఫలితంగా ఎంతో మంది విద్యార్థులు జే.ఆర్ .ఎఫ్, నెట్, జె ,ఎల్, డి .ఏల్,లు సాధించారు, సాధిస్తున్నారు కూడా. మరెంతోమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. తెలుగు శాఖలో ఈ మధ్యకాలంలో ముగ్గురు విద్యార్థులు డాక్టరేట్ పట్టాను కూడా పొందారు. ఇంకో 18 మంది పరిశోధక విద్యార్థులు తమ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఎల్లప్పుడూ విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడే నలుగురు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో తెలుగు శాఖ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ఎన్నో జాతీయ. అంతర్జాతీయ సదస్సులను ఈ విశ్వవిద్యాలయం నిర్వహించింది. కోవిడ్ సంక్షోభ సమయంలో 300 మందికి పైగా తెలుగు అధ్యాపకులతో ఆన్లైన్ లో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిత్యం అధ్యయన, అభ్యాసనాలతో ప్రామాణిక పరిశోధనలతో, తెలుగు భాష సాహిత్య రంగాలలో తన ప్రతిభను చాటుకుంటుంది ఈ విశ్వవిద్యాలయం.

* గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 1974వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఎస్.వి.కె.పి.ఎస్, డాక్టర్ కె .ఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రారంభించబడింది. న్యాక్ ఏ గ్రేడ్ తో పాటు సి.పి.ఈ అటానమాస్ స్థాయిలను సాధించి విద్యారంగంలో సమున్నత శిఖరాలకు చేరుకూని నేడు స్వర్ణోత్సవాలకు సమయుత్తమవుతూంది. పెనుగొండ పరిసర ప్రాంత విద్యార్థులకు విద్యాకల్పవృక్షంగా సేవలను అందిస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులను నిర్వహించింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మద్రాస్ విశ్వవిద్యాలయంతో కలిసి ‘విశ్వర్షి వాసిలి వాజ్గ్మయ వరివస్య’ పేరుతో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు శ్రీకారం చుట్టింది.

* బ్రిటిష్ ప్రభుత్వంలో దేశంలోనే మొట్టమొదటిగా ప్రారంభించబడిన మూడు విశ్వవిద్యాలయాల్లో మద్రాస్ విశ్వవిద్యాలయం ఒకటి. ఇది 1857లో ప్రారంభించబడింది. 1927లో తెలుగు విభాగం ఆవిర్భవించింది. 1937లో డాక్టర్ చిలుకూరి నారాయణరావు గారు మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం నుండి మొట్టమొదటి తెలుగులో పి. హెచ్. డి పట్టాను పొందారు. ఇది దేశంలోనే తొలి తెలుగు పీహెచ్.డి. కావడం విశేషం. ఆచార్య కోరాడ రామకృష్ణయ్య, ఆచార్య నిడదవోలు వెంకటరావు, వంటి సాహిత్య దిగ్గజాలు ఎందరో ప్రముఖులు తెలుగు శాఖ ప్రతిష్టను పెంచి పోషించారు. ప్రామాణిక పరిశోధనలకు మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం పెట్టింది పేరు. అదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పటివరకు వందలాది మంది పరిశోధకులకు, పరిశోధన పట్టాలను అందించింది. మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఇతర భాషా శాఖలకు చెందిన విద్యార్థులు తెలుగును డిప్లమో కోర్సుగా కూడా అధ్యయనం చేస్తున్నారు. నిరంతరం సాహిత్య సభలు నిర్వహించే మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఇప్పటికే వందలాది జాతీయ, అంతర్జాతీయ సదస్సులను నిర్వహించింది.

ఈ సదస్సుకు కన్వీనర్ గా వ్యవహరిస్తున్న డా. కె . వి.ఎస్.డి.వరప్రసాద్ గారు మాకు మంచి మిత్రులు. వరప్రసాద్ గారితో నాకు 2014వ సంవత్సరం నుంచి మంచి అనుబంధం ఉంది. అయితే అంతర్జాతీయ సదస్సు కన్వీనర్ గా వ్యవహరిస్తున్న ఈయన మాత్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్.డి. పట్టాను పొందడం ఇక్కడ కొసమెరుపు. ఆచార్య సుమతీ నరేంద్ర గారి దగ్గర పరిశోధక విద్యార్థిగా పీహెచ్.డి. ని పూర్తి చేసి 2011వ సంవత్సరంలో పిహెచ్.డి పట్టాను పొందారు. ఆచార్య సుమతీ నరేంద్ర గారి సారథ్యంలో మునిపల్లె రాజు సాహిత్యం- సమాలోచన అన్న అంశం పైన పరిశోధన చేసి పీహెచ్.డి పట్టాను సాధించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ కేంద్రంగా ఆచార్య సీ. మృణాళిని గారి సారధ్యంలో గురజాడ, గిరీశం షేక్స్పియర్ , ఫాల్టన్స్ పాత్రల తులనాత్మక పరిశీలన అన్న అంశం పైన ఎం.పి.ల్ సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారు.

ప్రస్తుతం డా. కె .వి. ఎస్.డి. వరప్రసాద్ గారు రాజమండ్రి నన్నయ్య విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో సహాయ ఆచార్యులుగా సేవలందిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఆంధ్రరాష్ట్రంలో జరిగే అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు కన్వీనర్ గా వ్యవహరిస్తున్న వరప్రసాద్ గారి మూలాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ముడిపడి ఉండడం కోసమెరుపు అనిపిస్తుంది. దేశ విదేశాల్లో జరిగే అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగిస్తూ ఉంటారు ఆయన, ఇప్పుడు ఈ అంతర్జాతీయ సదస్సుకు కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మనం ఇంకొక సాహితీ వేత్తను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. నన్నయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు,డా. తార పట్ల సత్యనారాయణ గారు నడయాడే సాహితి దిగ్గజంగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. వ్యాస కర్తగా నేను ఆ సదస్సు లన్నింటిలో పాల్గొన్నాను. ఆయనతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. ఉభయగోదావరి జిల్లాలలో తారపట్ల సత్యనారాయణ గారి గురించి తెలియని వారు ఉండరు, అదేవిధంగా సాహితీ లోకంలో కూడా ఆయన తనదైన ముద్రను వేశాడు. ఇలాంటి ఆణిముత్యాలను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మన తెలుగు జాతికి అందించింది.

***

ఈ సదస్సును నన్నయ్య విశ్వవిద్యాలయంతో పాటు మద్రాస్ విశ్వవిద్యాలయం కూడా సంయుక్తంగా కలిసి నిర్వహిస్తుంది. అయితే మద్రాస్ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు గారు పేరెన్నిక గన్న సాహిత్య అగ్రేసరులలో ఆయన ఒకరు. మృదుభాషి, వినయశీలి, సాహితీవేత్త, రంగస్థల కళాకారుడు, ఈయన చిన్నప్పటినుండే రంగస్థల కళాకారులు అయిన విస్తాలి శంకర రావు గారు, ఎం.ఫిల్. పట్టా కోసం హైదరాబాద్. విశ్వవిద్యాలయంలో, ప్రకాశం జిల్లా వీధి నాటకాలు అనే అంశం పైన పరిశోధన చేసి ఎం.ఫిల్. పట్టా పొందారు. ఆ తర్వాత అక్కడే ప్రకాశం జిల్లా జానపద కళారూపాలు ప్రదర్శన సాహిత్య అంశాలు – పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి. పట్టాను పొందారు. అయినాకూడా ఆయనలో విజ్ఞానతృష్ణ ఆగలేదు. తెలుగు పౌరాణిక రంగస్థలం నాటక సాహిత్యం విశ్లేషణాత్మక అధ్యయనం అనే అంశంపైన డిలీట్ కూడా మద్రాస్ విశ్వవిద్యాలయం వేదికగా పూర్తి చేశారు. అతి తక్కువ కాలంలో డిలీట్ పట్టా పొందిన వారిలో ఆచార్య విస్తాలి శంకరరావుగారు ఒకరు అంటే అతిశయోక్తి కాదేమో! ప్రస్తుతం ఆయన మద్రాస్ విశ్వవిద్యాలయానికి సెనేట్ సభ్యుడిగా, అకాడమిక్ సభ్యులుగా, దీంతోపాటు తెలుగు శాఖకు అధ్యక్షులుగా కూడా సేవల నందిస్తున్నారు. వివిధ హోదాలలో కొనసాగుతున్నారు. 100కు పైగా జాతీయ స్థాయి సదస్సులలో పరిశోధక పత్ర సమర్పణలు చేశారు. అంతర్జాతీయ సదస్సులలో 15 పరిశోధక పత్రాలను సమర్పించారు. ఏడు కాన్ఫరెన్స్లను, లెక్కకు మిక్కిలి వర్క్ షాప్ లను, నిర్వహించిన ఘనత విస్తాలి శంకర రావు గారికి దక్కుతుంది. దాదాపు ఆయన కలం నుండి 71 సాహిత్య వ్యాసాలు అత్యంత ప్రామాణికమైనవి వెలువడ్డాయి. ఇప్పటివరకు దాదాపు ఆయన అన్ని అంశాలలో కలిపి 25 పుస్తకాలకు సంపాదకత్వం వహించి వాటిని సాహితీ ప్రపంచానికి అందజేశారు. ఇలాంటి సాహితీ దిగ్గజం, మరియు డా. కె.వి.ఎస్.డి. వరప్రసాద్ ల సారధ్యంలో ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు ప్రారంభమవ్వడం, సాహితీ లోకాన్ని , సాహితి ప్రియులను కచ్చితంగా ఆలరిస్తుందని చెప్పవచ్చు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో పెనుగొండ అనే చిన్న పట్టణం విస్తరించి ఉంది. దశాబ్దకాలం నాటి మాట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత యొక్క 102 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ప్రపంచ నలుమూలల చర్చనీయాంశమైంది. ఆనాడు అన్ని దినపత్రికలో పతాక శీర్షిక ముద్రితమైంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కొలువై ఉన్న 102 అడుగుల విగ్రహం ఉన్న ప్రాంతానికి వాసవి ధామ్ అని పేరు పెట్టారు. ఈ వాసవి దమధామ్ కు కూతవేటు దూరంలోనే అంతర్జాతీయ సదస్సు జరిగే ఎస్.వి.కె.పి.ఎస్. కళాశాల ప్రాంగణం ఉంటుంది.

ఈ సదస్సుకు అన్నీ తనే అయి వ్యవహరిస్తున్న రంకిరెడ్డి రామ్మోహన్ రెడ్డి గారి తపన, సాహిత్య అభిరుచి, చరిత్ర పట్ల ఆయనకు ఉన్న అవగాహన, సంఘసంస్కరణ అభిలాషలను ఈ సదస్సు సందర్భంగా మనం స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు విజయవంతం కావాలని మనందరం మనసారా కోరుకుందాం.

(సమాప్తం)

జై ఆంధ్ర ప్రదేశ్

జై తెలంగాణ

డా.జి. భాస్కర్ యాదవ్.

అధ్యక్షులు, తెలుగు శాఖ.

ఏ.వీ, కళాశాల హైదరాబాద్.

Related posts