Praja Kshetram
తెలంగాణ

అంతర్జాతీయ సదస్సులో ప్రముఖ కవి – డా.జి. భాస్కర్ యాదవ్

అంతర్జాతీయ సదస్సులో ప్రముఖ కవి

 

-డా.జి. భాస్కర్ యాదవ్

హైదరాబాద్ నవంబర్ 29(ప్రజాక్షేత్రం):పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఎస్. వి. కె. పి. ఏస్ ,డా. కె. ఎస్.రాజు ఆర్ట్స్& సైన్స్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సులో ప్రముఖ కవి, రచయిత, వక్త, విమర్శకులు, కథకులు, నవల కారులు, వ్యాసకర్త అయిన డా.జి. భాస్కర్ యాదవ్ గారు విశ్వర్షి వాసి లి వసంత కుమార్ గారు రాసిన పెళ్లి పుస్తకం పై అనర్గళంగా ఉపన్యాసించారు. ఆయన ఆధునిక దంపాత్యనికి పెళ్లి పుస్తకమే బ్రతుకు పుస్తకము అయ్యింది. అన్న అంశం పైన పత్ర సమర్పణ చేశారు. భారతదేశంలో 100 వివాహాలు జరిగితే 33 వివాహాలు విడాకుల వరకు దారితీస్తున్నాయని ఆ విడాకులు కూడా ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలో ఉంటున్నాయని ఈ విడాకులను అరికట్టాలంటే పెళ్లి పుస్తకం ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ తమ ఉద్యోగస్తులకు ఉచితంగా అందజేయాలని సూచించారు. స్త్రీకి అక్షరం జ్ఞానం కలిగినప్పుడు ఆర్థిక స్వేచ్ఛ కలిగింది. అక్షర జ్ఞానం, ఆర్థిక స్వేచ్ఛ తో స్త్రీ స్వతంత్రంగా జీవించలనుకుంటుంది. సనాతన సాంప్రదాయంలో పతి యే ప్రత్యక్ష దైవం అన్న నినాదానికి తిలోదకాలు ఇస్తుంది. ప్రపంచం ఇప్పుడు కుగ్రామం అయిపోయింది. శాస్త్ర సాంకేతిక రంగామంత అరచేతిలోకి వచ్చింది. స్త్రీ హక్కులు స్త్రీకి కావల్సిన స్వేచ్ఛ, శ్రీ స్వావలంబన, స్త్రీ సాధికారికత, హక్కులు విధులు ఆమెకు ఉన్నటువంటి బాధ్యతలు, వంటి విషయాల పట్ల ఈ తరం స్త్రీలు పురోగామిస్తున్నరు. ఏడడుగుల బంధానికి మూడు ముళ్ళు తోడై, శత వసంతాలు సాగే ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, కోపతాపాలు, వెరసి ఒకే గొడుగు కింద కలిసిమెలిసి నివసిస్తూ ఒకరి కష్టసుఖాలను ఒకరు పంచుకుంటూ ఒకరి కోసం ఒకరు బతుకుతూ చివరికి దంపతులు ఇద్దరు పిల్లల కోసం తాపత్రయపడుతూ సంసారం అనే సాగరాన్ని నెట్టుకొస్తున్న నేటితరం దంపతులకు పెళ్లి పుస్తకం ఒక వరమాయింది. చాలామంది పాఠకులు దీన్ని చదివిన తర్వాత అదే మాకు బతుకు పుస్తకామైందని తమ అభిప్రాయాలను వెళ్లబుచ్చుతుంటరు. అంత చక్కగా విమర్శనాత్మక ధోరణిలో, సృజనాత్మకంగా కొత్త ఒరవడిని సృష్టిస్తూ విశ్వర్షి వాసిలి గారు ఈ పుస్తకాన్ని రాశారు. అంటాడు. సనాతన భారతదేశంలో విడాకుల సంఖ్య పెరగడం ఒకరకంగా సాంస్కృతులు సంప్రదాయానికి గొడ్డలి పెట్టు. అదేవిధంగా విడాకుల పట్ల స్త్రీలకు చైతన్యం కలిగి ఉండడం అంతర్జాతీయ స్థాయి ఆలోచనలకు ప్రతిరూపంగా కూడా చెప్పవచ్చు. ఈ విధంగా స్త్రీ అక్షర జ్ఞాన వంతురాలై హక్కులను సాధిస్తూ ఉంటూ విడకులను కోరుతుంటే ఆనందపడలో, దుఃఖపడల్లో సనాతన సాంప్రదాయమే తెలియజెప్పాలి.

 

కోపాలు ,తాపాలు. ప్రేమలు ఆప్యాయతలు, అనురాగాలు అనుబంధాలు, నమ్మకం, అప నమ్మకం, బాధ్యతలు, భాం ధవ్యలు, సమస్యలు, సంక్షోభాలు, పరిష్కారాలు, లేవ నెత్తే ప్రశ్నలు, సాంస్కృతి ప్రేమ, సాంప్రదాయాలు, అలవాట్లు, విసుర్లు, కసర్లు, కష్టాలు, నష్టాలు, ఆత్మీయత, అనుబంధం, అనురాగం, లాంటి విషయాలు ఎన్నో ఈ పెళ్లి పుస్తకంలో ఉన్నాయి. అయితే భార్యాభర్తల మధ్య సంభవించే ప్రతి తగాదను కూడా ఆయన పాజిటివ్ నెగిటివ్ కోణంలో చూపించారు. పాజిటివ్ కోణంలో చూపిస్తే వ్యక్తుల యొక్క మనస్తత్వం లో మార్పు లేకపోవచ్చు. అందుకొరకే ఈ పుస్తకంలో దాంపత్యంలో సంభవించే సమస్యలను పాజిటివ్ కోణంలోనూ, నెగిటివ్ కోణంలోనూ సామాజిక, దృక్కోణం లోనూ కూడా ఆలోచించి ఈ పుస్తకంలో వివరించారు రచయిత. పెళ్లి అనేది దంపతులకు ఇద్దరికీ స్టార్టింగ్ పాయింట్. ఆ దంపతులు ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ లోకాన్ని విడిచినాప్పుడు ఎండింగ్ పాయింట్ అవుతుంది. కానీ ఈ దంపతుల నుండి పొందిన సంతానం మాత్రం తరతరాలుగా నిలుస్తుంది. మానవజాతి ఉనికిని కాపాడుతుంది. అంటే పెళ్లికి ఉన్నటువంటి విశిష్టత ఎంత గొప్పదో మానవాళి అర్థం చేసుకోవాలి. ఆర్థేచా, కా మేచా, నాతిచరామి అంటూ ఏడడుగుల బంధంతో ప్రారంభమై మూడు అడుగుల గుంత వరకు చేరే ఈ ప్రయాణంలో సుఖవంతమైన జీవితాన్ని ఒడిసి పుచ్చుకోవాలి అంటే ఈ పుస్తకాన్ని చదవక తప్పదు. అంటారు రచయిత డా.జి. భాస్కర్ యాదవ్.

Related posts