Praja Kshetram
తెలంగాణ

ప్రయాణికుల పాలిట శాపంగా మారిన పర్యావరణవేత్తలు

ప్రయాణికుల పాలిట శాపంగా మారిన పర్యావరణవేత్తలు

-రోడ్డు విస్తరణకు ప్రభుత్వాలు అంగీకరించిన కేసులు తో గగ్గోలు పెట్టిస్తున్న వైనం

-యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గణపురం తరుణ్

చేవెళ్ల డిసెంబర్ 03(ప్రజాక్షేత్రం):ఎన్నో ఏళ్ల తర్వాత బీజాపూర్ హైవే రోడ్డు విస్తరిస్తుందని ప్రజలు ఎన్నో కలలు కన్నా కానీ ప్రయాణికుల ఆశలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నీళ్ళు చల్లుతుంది అని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గణపురం తరుణ్ అన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమి నుండి మన్నెగూడ వరకు నాల్గు లేన్ల రహదారి విస్తరణకు ప్రభుత్వం అంగీకరించినా… కానీ ప్రస్తుతమున్న రహదారికిరువైపులా చెట్లు ఉండడం మూలాన,రోడ్డు విస్తరణ పనులు ఆపేందుకు NGT లో కేసు వేయడం దీని మూలాన రహదారి విస్తరణకు బ్రేకులు పడ్డడం బాధాకరమన్నారు… ఇరుకు రోడ్డు వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని మొరపెట్టుకున్న , పర్యావణవేత్తలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారు.. ప్రజల ప్రాణాలు పోతుంటే చెట్లు,కేసులు అంటూ ప్రజాల జీవితాలతో చెలగాటాడ్డం సబబు కాదన్నారు… అంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన NGT దీన్ని త్వరగా పరిష్కరించి, గొడ్డళ్ళతో నరికేసే చెట్ల కన్నా రోడ్డు ప్రమాదాలతో చనిపోయే ప్రజల ప్రాణాలు ముఖ్యమనే నిజం తెలుసుకోవాలి అని అన్నారు . NGT మొయినాబాద్, చేవెళ్ల మండల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది..ప్రతీ ఏటా వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా NGT స్పందించడం లేదు. ప్రజల ప్రాణాల పట్ల ఇంత నిర్లక్ష్యం సరైంది కాదు NGT తక్షణమే స్పందించి కేసు ఉపసంహరించుకోవాలని చేవెళ్ల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గణపురం తరుణ్ కోరారు…

Related posts