ఎస్ జిటియు శంకర్పల్లి మండల నూతన కార్యవర్గం
శంకర్ పల్లి డిసెంబర్ 07 (ప్రజాక్షేత్రం):ఎస్ జిటియు శంకర్పల్లి మండల నూతన కార్యవర్గం శనివారం జిల్లా కన్వీనర్ గణేష్, కో కన్వీనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయ్యింది. గౌరవ అధ్యక్షులుగా ఆలంఖాన్ గూడ గ్రామానికి చెందిన మొగులయ్య, అధ్యక్షులుగా చందిప్ప గౌండ్ల శ్రీరాములు గౌడ్, వైస్ ప్రెసిడెంట్ లుగా ప్రొద్దుటూరు శ్రీనివాస్, కొండకల్ తాండ రవికాంత్ రెడ్డి, వైస్ మహిళా అధ్యక్షురాలిగా గాజులగూడ విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా కొండకల్ తండా బాలరాజ్, అదనపు ప్రధాన కార్యదర్శిగా గణేష్ నగర్ వెంకటేశ్వరరావు, కోశాధికారిగా చందిప్ప నర్సింహులు, సలహాదారులుగా కొత్తపల్లి హరికుమార్, ప్రొద్దుటూరు సుధాకర్ రెడ్డి, కార్యదర్శులుగా మహారాజ్ పేట్ రియాజుద్దీన్, ఎల్వర్తి మహేందర్, మాసాని గూడ శ్వేత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.