వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నివేదిక ఇస్తాం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) ఉప వర్గీకరణ పై అధ్యయనం చేసేందుకు తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని
రంగారెడ్డి బ్యూరో ప్రజాక్షేత్రం: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) ఉప వర్గీకరణ పై అధ్యయనం చేసేందుకు తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ మంగళవారం రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనమునకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కమిషన్ షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణకు సంబంధించి షెడ్యూల్డ్ కులాల వారు డాక్టర్ షమీమ్ అక్తర్ కు ఫిర్యాదులను సమర్పించడం జరిగింది. మాలలు, మాదిగలు, జంగములు, చిందులు, బేడ బుడగ జంగములు, బైండ్ల, మంగులతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులు డా.అక్తర్ కుఫిర్యాదులను సమర్పించి వారు షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వర్గాల సామాజిక-ఆర్థిక వెనుకబాటు కారణంగా విద్య, ఉద్యోగాలకు రిజర్వేషన్లు పొందడంలో ఎదుర్కొంటున్న అన్యాయాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి రామరావ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలోని ఎస్.సి.కాలనీ సందర్శించి అక్కడి వారితో మాట్లాడి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.