Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

కోవెలకుంట్ల, బేతంచెర్ల రైలు మార్గంలలో రాను, పోను అయ్యప్ప స్వామి భక్తులకు 8 ప్రత్యేక రైళ్లు

కోవెలకుంట్ల, బేతంచెర్ల రైలు మార్గంలలో రాను, పోను అయ్యప్ప స్వామి భక్తులకు 8 ప్రత్యేక రైళ్లు

 

-ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

నంద్యాల డిసెంబర్ 12(ప్రజాక్షేత్రం): నంద్యాల జిల్లా కేంద్రం మీదుగా బనగానపల్లె, కోవెలకుంట్ల రైలు మార్గంలో 4 ప్రత్యేక రైళ్ళు, పాణ్యం, బేతంచెర్ల, డోన్ రైలు మార్గంలో 4 ప్రత్యేక రైళ్లు అయ్యప్ప మాలాదారణ దీక్ష స్వాములకు శబరిమల వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు మొత్తం 8 ప్రత్యేక రైళ్లు కేంద్ర రైల్వే శాఖ నడుపుతుందని నంద్యాల ఎంపీ, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి గురువారం తెలిపారు. నంద్యాల జిల్లా వాసులకు ఇది శుభవార్త అని, గుంటూరు నుండి కొల్లం కు 8 స్పెషల్ రైళ్లు, కొల్లం నుండి నంద్యాల వైపు 8 స్పెషల్ ట్రెయిన్లు నడుపుతున్నారని ఆమె వివరించారు. తన విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్ ఈ 8 ప్రత్యేక రైళ్లు నంద్యాల జిల్లా అయ్యప్ప స్వామి భక్తులకు, జిల్లా ప్రజలకు వేశారని, నంద్యాల నుంచి బనగానపల్లె, కోయిలకుంట్ల రూట్లో, నంద్యాల నుంచి పాణ్యం , బేతంచేర్ల, డోన్ మీదుగా డిసెంబర్, జనవరి నెలలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయని అయ్యప్ప స్వామి భక్తులు, జిల్లా ప్రజలు ఈ ప్రత్యేక రైళ్ల ను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. గతంలో ప్రకటించిన 2 స్పెషల్ ట్రెయిన్ లకు రాను పోను టైమింగ్ సరిగ్గా లేవని రైల్వే అధికారులకు తెలిపామని, శబరిమల వెళ్లిన భక్తులకు తిరిగి రావడానికి మరొక ట్రెయిన్ లేకపోవడంతో..ఇప్పుడు ప్రకటించిన స్పెషల్ ట్రెయిన్ లు శబరిమల వెళ్లిన్న భక్తులు మాల విరమించి తరువాత తిరిగి వచ్చే వెసలుబాటు ఉంటుంది అని ఆమె తెలిపారు.

Related posts