Praja Kshetram
తెలంగాణ

తండాలో తీరని నీటి కష్టాలు

తండాలో తీరని నీటి కష్టాలు

 

పెద్దేముల్ డిసెంబర్ 13(ప్రజాక్షేత్రం): పెద్దేముల్ మండలంలోని పలు గ్రామాలు నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ఎర్రగడ్డ తండా గ్రామపంచాయతీ లో తాగునీరు కోసం గిరిజనులు అవస్థలు పడుతున్నారు. మిషన్ భగీరథ నీటి ట్యాంకు ఉన్నా నీరు సరిగ్గా రావడంలేదని తండావాసులు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలో ఒక సింగిల్ ఫేస్ బోర్ మోటార్ ఉండేదని అది గతంలోనే పడైన గత సర్పంచ్ పట్టించుకోకపోవడంతో అదికాస్తా పూర్తిగా పుడుకోపోయి నిరుపయోగంగా మారిందని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాగే నీటి సమస్య ఏర్పడితే తండా సమీపంలో ఉన్న వ్యవసాయ బోరు బావి నుంచి తండాకు నీళ్లు సరఫరా చేయాలని గతంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశించగా వ్యవసాయ బావి నుండి తండా వరకు పైప్ లైన్ వేసి వదిలేశారని, ఇప్పుడు మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడంతో తండాలో గత రెండు రోజులుగా మంచి నీరు సరఫరా లేక తండా వాసులు అల్లాడుతున్నారు. వ్యవసాయ బావి నుంచి నీళ్లు సరఫరా చేయాలని గ్రామస్తులు పంచాయతీ సిబ్బందికి కోరగా బావిలో నుంచి నీళ్లు సరఫరా చేయడానికి చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నందున ఇప్పుడు నీటి సరఫరా చేసే అవకాశం లేదని చెప్పడంతో ప్రజలకు ఏం చేయాలో తోచక అయోమయంలో పడ్డారు. ఎలాగైనా మంచినీరు సరఫరా చేయాలని తండా వాసులు అగ్రహించడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది వాటర్ ట్యాంకర్ ద్వారా మంచి నీరు సరఫరా చేయడంతో తాత్కాలికంగా గిరిజనులకు ఉపశమనం కలిగిందని, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అధికారులు స్పందించి గ్రామంలో మోటార్లు బాగు చేయించి గ్రామానికి వేధిస్తున్న నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Related posts