శ్రీతేజను పరామర్శించిన మందకృష్ణ
హైదరాబాద్ డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం):సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజను పరామర్శించేందుకు ఇప్పటివరకు సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు రాకపోవడం శోచనీయమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను మందకృష్ణ పరామర్శించి.. బాలుడికి అందుతున్న వైద్యసేవలపై ఆరాతీశారు. అల్లు అర్జున్.. బాధిత కుటుంబానికి రూ.కోటి అందించాలని.. శ్రీతేజ, అతని సోదరి చదువుకయ్యే ఖర్చులు భరించాలన్నారు.