Praja Kshetram
తెలంగాణ

నారాయణ స్కూల్లో దారుణం

నారాయణ స్కూల్లో దారుణం

 

-అయ్యప్ప దీక్ష వేసుకున్న విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు

-స్కూల్ ఎదుట అయ్యప్ప దీక్ష దారుల ఆందోళ

ఎల్బీనగర్ డిసెంబర్ 19 (ప్రజాక్షేత్రం): నారాయణ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని ఉపాధ్యాయుడు కర్రతో విచక్షణా రహితంగా కొట్టాడు. దీనికి నిరసనగా గురువారం స్కూల్ ఎదుట అయ్యప్ప దీక్ష దారులు, విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే… దిల్ సుఖ్ నగర్ లోని అన్నపూర్ణ కాంప్లెక్స్ లో నారాయణ స్కూల్ నిర్వహిస్తున్నారు. వశీకరణ్ సాగర్ అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. వశీకరణ్ తండ్రి అమరేందర్ సాగర్ లో కలిసి అయ్యప్ప దీక్ష చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం తరగతి గదిలో తోటి విద్యార్థితో వశీకరణ్ మాట్లాడుతుండగా మ్యాథ్స్ టీచర్ జోసెఫ్ ప్రేమ్ రాజ్ కర్రతో విచక్షణా రహితంగా కొట్టాడు. జరిగిన విషయాన్ని తండ్రి అమరేందర్ సాగర్ కు చెప్పాడు. కొడుకు ఒంటిపై ఉన్న దెబ్బలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మేరకు గురువారం అయ్యప్ప దీక్ష దారులతో కలిసి నారాయణ స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని మతాలను గౌరవించాలని సూచించారు. ఆందోళనలో కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, అయ్యప్ప దీక్ష దారులు పాల్గొన్నారు.

Related posts