గుంతల మాయమైన రోడ్డు…. ట్రాక్టర్ బోల్తా
నాంపల్లి,డిసెంబర్ 19(ప్రజాక్షేత్రం):బంగారిగడ్డ నుండి నాంపల్లి పోయే రోడ్డులో ఆర్ అండ్ బి రోడ్డు గుంతల మయంగా ఉండడం వల్ల పత్తి ట్రాక్టర్ బోల్తా పడింది కావున ఆర్ అండ్ బి అధికారులు మరియు రాజకీయ నాయకులు ఈ రోడ్డు మరమ్మతుల గురించి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం.రోడ్డు పనులు నత్త నడకన కొనసాగుతున్నాయి. రోడ్డు పనులను మరిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురికావటం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా రోడ్డు నిర్మించేందుకు వేసిన కంకర అలాగే వదిలిపెట్టడంతో ద్విచక్ర వాహనాలు దానిపై వెళ్తూ ప్రమాదాలు జరిగి ఆసుపత్రి పాలవుతున్నారు. కానీ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. రోడ్డు నిర్మాణానికి రహదారిపై కంకర పరిచి నెలలు కావుస్తున్న లారీలు వంటి భారీ వాహనాలు నడపడంతో బస్సు విపరీతమైన దుమ్ముతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో శ్వాసకోస సమస్యలు వచ్చే ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురవుతున్నారు. బీటీ రోడ్డు పనులను ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.