Praja Kshetram
తెలంగాణ

ఆఫీస్ కు రాకుండా.. బంగ్లాలోనే కార్యకలాపాలు…

ఆఫీస్ కు రాకుండా.. బంగ్లాలోనే కార్యకలాపాలు…

 

-నారాయణపేట జిల్లా పరిధిలో ఓ అధికారి

-కలెక్టరేట్ కార్యాలయానికి రాకుండానే తన అధికారిక నివాసంలోనే ఆఫీసును కొనసాగిస్తున్నాడు.

నారాయణపేట డిసెంబర్ 20 (ప్రజాక్షేత్రం):నారాయణపేట జిల్లా పరిధిలో ఓ అధికారి కలెక్టరేట్ కార్యాలయానికి రాకుండానే తన అధికారిక నివాసంలోనే ఆఫీసును కొనసాగిస్తున్నాడు. తన పరిధిలోని అధికారులను అధికారిక నివాసంకి పిలిపించుకొని రివ్యూ మీటింగ్ లు కొనసాగించడంతోపాటు..కార్యకలాపాలన్నింటిని అక్కడి నుంచే నడిపిస్తున్నాడు. అధికారిక నివాసం చుట్టూ మూడంచల తెరలు ఉండడం విశేషం. ఈ తెరలు ఉండటంతో ఎవరూ లోపలికి వెళ్తున్నారు?ఎవరెవరు బయటకు వస్తున్నారనేది గూడుపుటానిగా ఉంటుంది. తనపై స్థాయి అధికారి సైతం దీర్ఘకాలిక సెలవు పై వెళ్లిన సందర్భంలో కూడా కలెక్టరేట్ కు రాకుండా అధికారిక నివాసం నుంచే కార్యకలాపాలను నడిపించడం వెనకాల ఉన్న అంతర్యం ఏమిటో తెలియడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ పేరుతో ప్రజా సమస్యలను నేరుగా చెప్పుకునేందుకు అవకాశం కల్పించాడు. కానీ నారాయణపేటలో మాత్రం కీలక శాఖ కు చెందిన అధికారి కలెక్టరేట్ కు చాలా సందర్భాల్లో రాకుండానే అధికారిక నివాసంలోనే కార్యకలాపాలను కొనసాగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts