Praja Kshetram
తెలంగాణ

విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేందుకు తల్లిదండ్రుల కృషి తప్పనిసరి.. ఎంఈఓ నర్సింగ్ రావు

విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేందుకు తల్లిదండ్రుల కృషి తప్పనిసరి.. ఎంఈఓ నర్సింగ్ రావు

 

పెద్దేముల్ డిసెంబర్ 21(ప్రజాక్షేత్రం):విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేందుకు తల్లిదండ్రుల యొక్క కృషి ప్రధానం అని మండల విద్యాధికారి నర్సింగ్ రావు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని బుద్ధారం ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రతి మూడో శనివారం పాఠశాలలో జరిగే పేరెంట్స్ సమావేశానికి హాజరవ్వాలని ఆయన సూచించారు. ప్రతి తల్లిదండ్రి విద్యార్థులు యొక్క సామర్ధ్యాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అన్నారు. పిల్లలు ప్రతిరోజు తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మొదటగా తల్లిదండ్రుల మీదనే ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా పిల్లలకు బయట ఫుడ్ కాకుండా, ఇంట్లో తయారుచేసిన సాధారణ భోజనాన్ని అందించాలని తల్లిదండ్రులను ఆదేశించారు. తద్వారా పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు నిత్యం ఇంట్లో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే విధంగా కృషి చేయాలని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో ఈ సమావేశానికి హాజరైన తల్లిదండ్రులు పలు రకాల ఇంటి వంటలను తయారు చేసుకొని పాఠశాలకు తీసుకొచ్చారు. కాగా వారు తెచ్చిన సాధారణ ఇంటి వంటలను విద్యాధికారి మరియు ఉపాధ్యాయులు పరిశీలించి, నిత్యం పిల్లలకు ఇలాంటి సాధారణ వంటకాలను తయారు చేసేందుకు పిల్లలకు కూడా శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుందని పేర్కొన్నారు. చివరగా ఇంట్లో తయారుచేసిన వంటకాలు చాలా రుచికరంగా ఉన్నాయని ఎంఈఓ నర్సింగ్ రావు విద్యార్థుల తల్లిదండ్రులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts