అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి
-బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
-సంగారెడ్డి ర్యాలీలో పాల్గొన్న కొండాపూర్ కాంగ్రెస్ నేతలు
కొండాపూర్,డిసెంబర్ 21(ప్రజాక్షేత్రం):రాహుల్ గాంధీ పిలుపు మేరకు సంగారెడ్డిలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగిన ర్యాలీలో కొండాపూర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అవమానించారని, ఎగతాళి చేసి అహంకారంగా మాట్లాడటాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాధులు ఖండించాలని అన్నారు. అమిత్ షా అంబేద్కర్ పట్ల ఆర్ ఎస్ ఎస్ బీజేపీ కి ఉన్న అవగాహణనను వ్యక్తం చేశారని అట్టడుగు వర్గాల పట్ల వారి వైఖరిని చెప్పారని అన్నారు.దుర్మార్గమైన దారుణమైన అహంకార చర్యను అందరూ ఖండించాలన్నారు .ఈ మతోన్మాద చర్యను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నిసార్లు అంబేద్కర్ అని పదే పదే అతడిని స్మరించుకుంటారు దానికి బదులుగా ఏదో ఒక హిందూ దేవుడిని స్మరించుకుంటే మీకు 7 జన్మలకు స్వర్గం దక్కుతుందనడం సిగ్గు చేటన్నారు. అలా అనటమే కాకుండా మాటి మాటికీ అంబేద్కర్ పేరు ఎత్తడం వీళ్లకు పెద్ద ఫ్యాషన్ అయిపోయిందని ఏగతాళిగా మాట్లాడటం తగదన్నారు. ఎన్పికల ముందు అంబేద్కర్ పేరు జపం చేసి అధికారం లోకి వచ్చాక ఆయన పేరు ఎత్తకూడదని చెప్పటం సిగ్గు చేటన్నారు. ఈ దాడులను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవలిసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, కొండాపూర్ మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి, గొల్లపల్లి మాజీ సొసైటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ జిల్లా నాయకులు నరసింహారెడ్డి, జనరల్ సెక్రెటరీ నర్సింలు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుదాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, పార్టీ జిల్లా నాయకులు గౌరీ రెడ్డి శ్రీధర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్, మాజీ మండల యువజన అధ్యక్షులు సునీల్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.