అంబేడ్కర్ మాకు దేవుడితో సమానం
-తక్షణమే అమిత్ షాను బర్తరఫ్ చేయాలి
-రావిర్యాల అంబేద్కర్ విగ్రహం నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ భారీ ర్యాలీ
-చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్
శంకర్ పల్లి డిసెంబర్ 24(ప్రజాక్షేత్రం):అంబేడ్కర్ తమకు దేవుడితో సమానమని చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీమ్ భరత్ అన్నారు. పార్లమెంటులో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి సమక్షంలో రావిర్యాల అంబేద్కర్ విగ్రహం నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. అనంతరం భీమ్ భారత్ మాట్లాడుతూ అంబేడ్కర్ పేరు బీజేపీ నేతలకు ఫ్యాషన్ అయితే, తమకు మాత్రం ఆరాధ్య దైవమన్నారు. రాజ్యాం గాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, మనుస్మృతి అమలు చేసేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ కుట్ర చేస్తోందని ఆరోపిం చారు. తక్షణమే అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ ను అవమానించిన బీజేపీ తీరును ప్రజాస్వామ్య రీతిలో ఎండగడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. నిత్యం రాజ్యాంగాన్ని తప్పుపట్టే బీజేపీ నేతలు.. ఇప్పుడు అంబేడ్కర్ ను కూడా తూలనాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి బీజేపీపై కాంగ్రెస్ పెద్దఎత్తున పోరాడుతోం దని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యులు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి భార్గవ్ రామ్, తోలకట్ట సత్యనారాయణ, చిలుకూరు రాజు, కుమార్, నవాబుపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉపేందర్ రెడ్డి, జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ఇన్చార్జులు, మండల పార్టీ అధ్యక్షులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, ఎన్ఎస్‌యూఐ విభాగం నాయకులు, యువజన కాంగ్రెస్ విభాగం నాయకులు, మహిళా విభాగం నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, ఎస్టి, ఎస్సి, బిసి మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు.