Praja Kshetram
తెలంగాణ

ప్రభుత్వ భూములు పట్టాగా మార్చి రిజిస్ట్రేషన్

ప్రభుత్వ భూములు పట్టాగా మార్చి రిజిస్ట్రేషన్

 

-48 ఎకరాలకు మిగిలింది 3 ఎకరాలు మాత్రమే

-రెవెన్యూ అధికారులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.?

-మన్సాన్ ల్లి 189 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో రిజిస్ట్రేషన్లు

-పట్టించుకోని సంబంధిత రెవెన్యూ అధికారులు

కొండాపూర్ జనవరి 05(ప్రజాక్షేత్రం):ప్రభుత్వ భూములను ప్రభుత్వాధికారులు కాపాడుతున్నారా..? లేక ప్రవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారా..? అనే ప్రశ్నలు వెలుగులోకి వస్తున్నాయి. పేదరికం పోవాలనే తపనతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిర గాంధీ హయంలో సీలింగ్ యాక్టు తీసుకొచ్చి అసైన్డ్ భూములు పంపిణీ చేయడం జరిగింది. ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రైతుల పొట్ట గోడుతూ రియార్టర్ తో కుమ్మకై ఆరు కాయలు, మూడు పూవ్వులు ముడులతో ప్రభుత్వాధికారులు అసైన్డ్ భూములను పట్టాలోకి మార్పు చేస్తున్నారు. దీంతో రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది. కొండాపూర్ మండల పరిధిలోని మన్సాన్ పల్లి గ్రామ శివారులోని శంకర్ పల్లి, వికారాబాద్ కు వేల్స్ రహదారి పక్కనే సుమారు 7ఎకరాల ప్రభుత్వ భూమిని రియార్టర్ లు కబ్జా చేశారు. మన్సాన్ పల్లి గ్రామంలోనే సర్వే 189 నెంబరులో 48ఎకరాల 12గుంటల భూమి అసైన్డ్ భూమి ఉంది. ఈ భూమి పేదల బ్రతుకు దెరువుకోసం ప్రభుత్వం పంపిణీ చేస్తే ప్రభుత్వ అధికారులు మూడుపులకు ఆశపడి ప్రవేట్ వ్యక్తుల పేర్ల మీదకు మారుస్తున్నారు. ఆ ప్రభుత్వ భూమి లో పోరంబోకు, ఇనాం, అసైన్డ్ భూముల పేరిట ప్రభుత్వ భూములు న్నాయి. ఈ భూములను రియార్టర్ లకు ప్రభుత్వాధికారులు చేతులు కలిపి రైతుల పేరుమీద ఉన్న భూములను రియార్టర్ ల పేరు మీదకు మారు- స్తున్నారు. ఇదే న్యాయమని అడిగితే మాకు తెలియదు అని అధికారులు జవాబు ఇస్తున్నారు. అందరు శాఖహారులే రొయ్యల ముల్లు ఏడపాయే అని రైతులు అంటున్నారు. ప్రభుత్వ భూమి కొన్న, అమ్మిన నేరమే అని ప్రభుత్వం అంటుంది. రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్న ఏర్వరు పట్టించుకుంటున్నారని పలువురు అనుకుంటున్నారు.

Related posts