Praja Kshetram
తెలంగాణ

గుండెపోటుతో యువకుడు మృతి

గుండెపోటుతో యువకుడు మృతి

 

శంకర్ పల్లి జనవరి 05(ప్రజాక్షేత్రం):గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో జరిగింది. సింగాపురం వార్డుకు చెందిన రుద్రారం వెంకట్ కు (27) ఆదివారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. యువకుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండే వెంకట్ మృతి చెందడంతో వార్డు ప్రజలు, స్నేహితులు విచారం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, రెండు సంవత్సరాల కూతురు ఉంది.

Related posts