శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి ప్రత్యేక పూజలు
శంకర్ పల్లి జనవరి 07(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మొదటి మాజీ స్పీకర్, శాసన మండలి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధన చారి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయిశివ మాజీ స్పీకర్ కు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ని స్వామివారి శేష వస్త్రంతో సన్మానించి, స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ మహిమగల 11వ శతాబ్దపు మరకత శివలింగాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. సమయం చూసుకొని కుటుంబ సభ్యులతో మళ్ళీ శివాలయానికి వస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర రాజు స్వామి, గౌరవ అధ్యక్షులు సదానందం గౌడ్, చైర్మన్ గోపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.