అడ్డగోలుగా అక్రమ ఫామ్ హౌస్
• జిల్లాలో అక్రమ లేఅవుట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు వేసిన రియల్టర్లు… ఇప్పుడు కాంగ్రెస్ నేతలతో అంటకాగుతూ అనుమతులు లేకుండా ఇళ్ల స్థలాల లేఅవుట్లు వేస్తున్నారు. అభూత ప్రకటనలతో ప్రజలను నమ్మించి, ప్లాట్లను విక్రయిస్తున్నారు. చేవెళ్ల మండలం మల్లారెడ్డి గూడ గ్రామ సర్వే నంబర్ 582,583 రెవెన్యూ పరిధిలో పదుల సంఖ్యలో అక్రమ లేఅవుట్లు వేసిన రియల్టర్లు.. వీటిల్లో కొన్నిటికి మాత్రమే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అనుమతి లేకుండా వెంచర్లు వేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి అయినా చూడడం లేదు.
-మల్లారెడ్డి గూడ లో పూర్తిస్థాయి అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్.
-నాలా పన్ను చెల్లించకుండా దర్జాగా ప్లాట్లలో నిర్మాణాలు .
-లేఅవుట్‌లలో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘన.
-కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఆగని రియల్టర్ల దందా.
చేవెళ్ల, ఫిబ్రవరి 10(ప్రజాక్షేత్రం):ల్యాండ్ కన్స్ట్రక్షన్ అనుమతులు లేకుండానే. విచ్చలవిడిగా సాగుతున్న నిర్మాణాలు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందకుండానే భారీ లేఅవుట్‌లు వేసి, ప్లాట్లను విక్రయిస్తున్నారు. చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, నవపేట్, మొయినాబాద్ మండలాల్లో ఇటీవల కాలంలో పంచాయతీ అనుమతుల పేరుతో లేఅవుట్‌లు వేశారు. నిబంధల ప్రకారం తొలుత వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చాలి. 33 అడుగుల వెడల్పుతో బీటీ రోడ్లు, మురుగు నీటిపారుదలకు కాలువల నిర్మాణాలు చేపట్టాలి. లేఅవుట్‌లో విద్యుత్ స్తంభాలు వేసి, తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలి. లేఅవుట్‌లో పది శాతం భూమిని సామాజిక అవసరాలకు విడిచిపెట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో లేఅవుట్‌లకు ముందుగా పంచాయతీలో తీర్మానం చేసిన తరువాత సాంకేతిక పరిశీలన పూర్తయిన తరువాత అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదే మండల రెవెన్యూ అధికారులతో కూడా సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందాలి. కానీ రియల్టర్లు ఇవేమీ పట్టించుకోవడం లేదు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల అండతో హెచ్ ఎం డి ఎ అప్రూవల్ లేకుండానే వెంచర్లు వేస్తున్నారు.
మల్లారెడ్డి గూడెం సర్వే నంబరు 582, 583 లో సుమారు 13 ఎకరాలు వుంది. ఇందులో 10గుంటల నుంచి 20 గుంటలుగా ప్లాటింగ్ చేసి 2019 లో హెచ్ఎండిఏ అనుమతులు లేకుండా అక్రమ లే-అవుట్ వేశారు. వెంచర్ లోని ప్లాట్లకు హెచ్ ఎం డి ఎ అనుమతులకు దరఖాస్తు పెట్టుకున్నారని, కానీ ఎటువంటి అనుమతులు రాలేదు అయిన వెంచర్లో ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై మండల టౌన్ ప్లానింగ్ అధికారి, గ్రామ కార్యదర్శి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలపై గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా , గ్రామ పంచాయతీ నుండి ఎటువంటి అనుమతులు లేవని, గతంలో నిర్మాణాలను ఆపాలని గ్రామపంచాయతీ నుండి నోటీసులు ఇవ్వడం జరిగిందని, గ్రామ కార్యదర్శి తెలిపారు. కాని దీనికి ఇంతవరకు హెచ్ ఎం డి ఎ ఫైనల్ అనుమతులు రాలేదు. కాని లేఔట్ లో , స్విమ్మింగ్ పూల్, ఫాంహౌస్ పనులు పూర్తి చేస్తున్నారు. దీనిపై మల్లారెడ్డిగూడ గ్రామ పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసిన కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. కళ్ళముందు పనులు జరుగుతుంటే నోటీసు ఇచ్చిన కూడా పనులు జరుగుతున్నాయి అని ఆరోపలను. అక్రమ లేఅవుట్‌లు వేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అధికారులు ఏ విధంగా కొమ్ము కాస్తున్నారో ఇది ఒక ఉదాహరణ అని స్థానికుల నుండి పలు విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి అక్రమంగా వెలుస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ లేఔట్ లో ఉన్న బోరుమోటర్ కు, విద్యుత్ అనుమతులు లేకుండా, విద్యుత్ మీటర్ కి అనుమతులు లేకుండా అక్రమంగా విద్యుత్ కనెక్షన్ నేరుగా 3పేస్ లైన్ నుండి వైర్లు తగిలించి రోడ్డు పనులకు, అక్కడి లేఔట్ పనులకు అక్రమంగా విద్యుత్తు వాడుతున్నారు. ఈ విషయాన్నీ చేవెళ్ల విద్యుత్తు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదు. కార్యదర్శి నుండి మండల టౌన్ ప్లానింగ్ అధికారులవరకు ముడుపులు తీసుకొని ఎటువంటి అక్రమ నిర్మాణానికైనా
సహకరిస్తున్నారని ఆరోపణ వినిపిస్తున్నాయి.
అక్రమ లేఔట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయకుండా చర్యలు తీసుకోవాలి, కాని అవేవి పట్టకుండా యతేచ్చగా కొన్ని అక్రమ లేఔట్ లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ లు చేస్తున్న రెవెన్యూ అధికారులు. ఈ అక్రమ నిర్మాణాలకు చేవెళ్ల విద్యుత్ శాఖ అధికారులు ఒక అడుగు ముందుకేసి దగ్గరుండి విద్యుత్ కనెక్షన్లు ఇస్తూ రియాల్టర్లకు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ,ఈ అక్రమ లేఔట్లకు దగ్గరుండి విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్న వైనం. ఈ లేఔట్లలోని అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం నిర్మాణాలకు చేవెళ్ల విద్యుత్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా విలేజ్ లైన్ నుండి నేరుగా కనెక్షన్లు ఇస్తున్నారు. దీనివల్ల ఆ గ్రామంలో ఇళ్లల్లో బల్బులు ఫీజులు ఎగిరి పోతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ పై, మండల టౌన్ ప్లానింగ్ అధికారులపై ఇన్ని ఆరోపనలు వస్తున్న అవేమీ వినపడనట్టుగా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, చివర్ల మండల టౌన్ ప్లానింగ్ అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అక్రమ నిర్మాణ లకు మడుగులోత్తుతూ.. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అవినీతికి పాల్పడుతున్న, అవినీతి అధికారులపై జిల్లా కలెక్టర్ స్పందించి కఠినంగా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.