Praja Kshetram
తెలంగాణ

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం

 

– తెలంగాణలో మరోసారి కులగణన చేయాలని ప్రభుత్వం నిర్ణయం

– స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్

– రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలు నిర్వహించే అవకాశం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కులగణన పూర్తి కావడంతో ఈ నెల 15వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని భావించారు. కానీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కులగణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేపడుతున్నట్లు ప్రకటించారు.ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలో మరోసారి కులగణన చేపట్టి, రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related posts