ఏసీబీ వలలో సీఐ, కానిస్టేబుల్స్..!
హైదరాబాద్ ఫిబ్రవరి 18(ప్రజాక్షేత్రం):సమాజంలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే అవినీతి చరిత్ర మూటగట్టుకుంటున్నారు. ఏసీబీ అధికారులకు మరోసారి పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం తాజాగా వెలుగులోకి వచ్చింది. నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కేసులో రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులకు మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నరసింహాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భద్రాద్రి జిల్లాలో మరో ఘటనలో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లు ఏసీబీకి దొరికారు. అటవీ భూమి నుంచి మట్టి తవ్వుకునేందుకు రైతునుండి రూ.30 వేలు లంచంగా సిబ్బంది అడిగారు. దీనిపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం ఇల్లెందు మండల కొమరారం ఫారెస్టు రేంజ్ ఆఫీసులో దాడులు జరిపారు.