Praja Kshetram
తెలంగాణ

సీఎంకి రియల్ ఎస్టేట్ తప్ప..స్టేట్ గురించి పిక్కర్లేదు

సీఎంకి రియల్ ఎస్టేట్ తప్ప..స్టేట్ గురించి పిక్కర్లేదు

ఆమనగల్, ఫిబ్రవరి 18(ప్రజాక్షేత్రం):ఆమనగల్ మున్సిపాలిటీలో నిర్వహించిన రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఆమనగల్ కు బయల్డేరిన కేటీఆర్ కు మార్గమధ్యలో తుక్కుగూడ వద్ద రైతులు, గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తుక్కుగూడ చౌరస్తాలో గులాబీ జెండాను కేటీఆర్ ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ నాయకులు మన ఇంటికి వస్తే గల్లా పట్టి నిలదీయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 36 సార్లు ఢిల్లీకి పోయిండు. కానీ, రాష్ట్రానికి 30 పైసలు కూడా తేలేదని ఆరోపించారు. కాంగ్రెస్ 14 నెలల కాలంలో 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, గురుకులాలు నిర్వీర్యమయ్యాయని, గురుకులాల్లో వసతులు లేక 56 బిడ్డలు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోర్త్ సిటీ పేరిట రియల్ వ్యాపారానికి తెరలేపి ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ తప్ప..స్టేట్ గురించి పిక్కర్లేదని విమర్శించారు. తుక్కుగూడ నుంచి కల్వకుర్తి వరకు ఆయనకు భూములపైనే ప్రేమ తప్ప, రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి పై ఆమనగల్ రైతు దీక్షలో కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో అన్ని వర్గాలను ఆదుకున్నాడని, రైతు బంధు పథకంతో రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాలో వేసిన్నాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేసేంత వరకు గత ఆరు నెలల నుంచి రాష్ట్రం నలుమూలల రైతు దీక్షలో పేరిట ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నామన్నారు. స్థానిక సంస్థల్లో ఇప్పటికైనా మోసకారులను, దొంగలను తరిమి కొట్టాలని సూచించారు. ఇప్పటికైనా ప్రజలు మోసకారుల పట్ల  అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ కోరారు.

Related posts