నగరంలో పలుచోట్ల భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం
– నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో పలుచోట్ల వాన దంచికొడుతోంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం): హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో పలుచోట్ల వాన దంచికొడుతోంది. అప్పటి వరకు ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం లభించింది. దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, నాగోల్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురస్తోంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండల పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఈశాన్య దిశగా కొనసాగుతున్నదని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు, నార్త్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, తుఫాన్ గాలులు వీయనున్నాయని ప్రకటించింది.