Praja Kshetram
తెలంగాణ

శాశ్వత పరిష్కారంగా ఎస్సీ వర్గీకరణ జరగాలి:మంద కృష్ణ మాదిగ

శాశ్వత పరిష్కారంగా ఎస్సీ వర్గీకరణ జరగాలి

 

– భవిష్యత్ లో ఏ కులంలో రిజర్వేషన్ల విషయంలో అసంతృప్తి రావద్దు

– ఎస్సీ వర్గీకరణ నివేదిక వచ్చినాకే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి

– కమిషన్ నిత్యం ఎస్సీ కులాలకు అందుబాటులో ఉండి వారి ఆకాంక్షలను తెలుసుకోవాలి

– అందరికీ న్యాయం జరిగేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడాలి

– ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ

హైదరాబాద్ ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):ఎస్సీ రిజర్వేషన్ అంశం లోతుగా పరిశీలించేందుకు కమిషన్ గడువు పెంచిన నేపథ్యంలో అన్ని కులాలు అప్రమత్తంగా ఉండి మీకు న్యాయం జరగాల్సిన విషయంపై కమిషన్ ముందుకి తేవాలని 58 కులాల సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు కమిషన్ ఇంతకు ముందు సమర్పించిన నివేదికలో లోపాలు ఉన్నాయని సీఎం, సబ్ కమిటీ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. ఈ నెల 4న కమిషన్ నివేదిక చర్చించకుండానే ఆమోదించారు. అందులో కొన్ని లోపాలు ఉన్నాయని మంత్రివర్గ ఉపసంఘం, కేబినెట్, అసెంబ్లీలో గుర్తించలేదు, చర్చ జరుగలేదు. లోపాలను సవరించే ప్రయత్నం చేయడానికి ప్రభుత్వం సమయం తీసుకోలేదు. గతంలో 4 గ్రూప్ లు ఉండగా ఇప్పుడు 3 గ్రూపు లు గా చేయడం వెనుక లోపాలు ఉన్నాయని, నివేదిక లోపభూయిష్టంగా ఉందని చెప్పాం. హేతుబద్ధత, శాస్త్రీయత పరిగణలోకి తీసుకోవాలని కోరాం, ఐతే అక్తర్ నివేదికలో అవే లోపించాయి. మూడు గ్రూపుల్లో ఒక్కో గ్రూప్ నకు ఒక్కో విధానం చూశారు. కొందరికి వెనుకబాటు చూశారు, కొన్ని కులాలకి జనాభా చూశారు. ఇందులో శాస్త్రీయత, హేతుబద్ధత లోపించింది. ఇక్కడ న్యాయం అనే దానికి అర్థం లేదు జనాభా ప్రాతిపదిన రిజర్వేషన్ ఉంది. ఒక్కో గ్రూప్ లో వారి శాతానికి తగినట్లు ఉండాలి. కానీ అవేవీ చూడలేదు దీనివల్ల అందరికీ న్యాయం జరుగలేదని రుజువైంది. గ్రూప్ 4 ఎందుకు రాలేదు, అందులో రావాల్సిన వారెవరు. ఇవేవీ పరిగణలోకి తీసుకోలేదు నిన్న కమిషన్ ను మరోసారి కలిసి లోతుగా అధ్యయనం చేయాలని చెప్పాం. మాలలు మాత్రమే వర్గీకరణను వ్యతిరేకిస్తూ అడ్డుకుంటున్నారు కదా. మిగతా 58 కులాలు వర్గీకరణ కోరుతున్నాయి 57 కులాల సంఘాలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా.. మరో వందేళ్ల వర్గీకరణకు అన్యాయం జరిగిందనే భవన రాకుండా అప్రమత్తంగా ఉందాం. ఆ విధంగా కమిషన్ నివేదిక, ప్రభుత్వ నిర్ణయం అంత శాస్త్రీయంగా, న్యాయబద్దంగా ఉండాలని కోరుతున్నాం. మాదిగలకు తమ కుల జనాభా మించి లాభం కోరుకోవడం లేదు, అందరికీ రావాలని కోరుతున్నాను 75 ఏళ్ల తర్వాత జరుగుతున్న ప్రక్రియలో ప్రతి కుల సంఘం బాధ్యత ఉంది. ఆయా కులాల నాయకులు, మేధావులు అప్రమత్తంగా ఉండాలి, 10 తేదీ వరకు గల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫలానా వారివల్ల మేము దోపిడీకి గురయ్యమనే పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత ఆయా కుల నాయకులకు ఉంది. పూనా ఒడంబడిక జరిగిన సెప్టెంబర్ 24 ను ఇప్పటికీ కొన్ని దళిత సంఘాలు నిరసన దినంగా పాటిస్తున్నారు సెప్టెంబర్ 24న పూనా ఒడంబడిక జరిగిన రోజు అంబేడ్కర్ ఆవేదన వ్యక్తం చేస్తూ కొబ్బరికాయలో కొబ్బరిని తీసుకొని చిప్ప మాత్రమే మాకు ఇచ్చారని చెప్పారు. ఆ రిజర్వేషనపై ఎదిగిన నాయకులే కమ్యునల్ అవార్డ్ వదులుకోవడం ద్వారా స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోల్పోయారు. 93 ఏళ్ల తర్వాత కూడా పూనా ఒడంబడిక పై నిరసన వ్యక్తం అవుతోంది తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో భౌగోళికంగా తెలంగాణ కోరుతున్నామని, ఇంచు కూడా కోల్పోవడానికి కుదరదని చెప్పారు కేసీఆర్ సీమాంధ్ర పెట్టుబడి దారి వర్గం ఒత్తిడికి 7మండలాలు నీట మునిగాయి. 200కి పైగా ఆదివాసీ గ్రామాలు మునిగాయి. ఆదివాసీలు చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. అందువల్ల ఏ మాత్రం నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఎస్సీ వర్గీకరణ జరిగే సమయంలో ఎవరికీ నష్టం లేకుండా ప్రతి కులం భాగస్వామ్యం కావాలి. రిజర్వేషన్ ఫలాలు కోసం అన్ని కులాలు లిఖిత పూర్వకంగా వినతుల ఇవ్వాలి కమిషన్ తమ వద్దకు వచ్చేవారికి అందుబాటులో ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద మళ్లీ కమిషన్ నివేదికను తెప్పించే ప్రయత్నం చేయకుండా పూర్తి స్థాయిలో సమయం వెచ్చించే చూడాలి‌. గతంలో ప్రభుత్వం కొంత ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువు ఉన్నా 2న తెప్పించుకున్నారు. శాస్త్రీయత, హేతుబద్ధత లేకుండా నివేదిక తెప్పించి లోపాలు సవరించని కారణంగా మళ్లీ గడువు పొడిగించాల్సి వచ్చింది. మార్చి 10 వరకు గడువు పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ధన్యవాదాలు 9వ తేదీ రాత్రి వరకు కూడా ప్రతి కులంపై లోతుగా అధ్యయనం చేయాలి మార్చి 1 నుంచి 5వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నట్లు ప్రచారం ఉంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పెడుతున్నట్లు సమాచారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు 1 నుంచి పెట్టడం అంటే మళ్ళీ ఒత్తిడి చేస్తున్నారేమో మూడు గ్రూపులుగా చేసి హేతుబద్ధత లేకుండా చేశారు గ్రూప్ బీలో మాదిగల తర్వాత ఉన్న 17 కులాలు జనాభా 40 వేలు మాత్రమే. సీ గ్రూప్ లో మాలలు కానీ ఇతర కులాలై 2.44లక్షలు ఉన్నారు. ఇందులో అభివృద్ధి చెందిన వారితో మరో గ్రూప్ ఏర్పాటు చేయాలి. 31.32.043 సింగిల్ మాదిగ జనాభా అండగా మాల, మాల అయ్యవార్ కలిపి 15.32 లక్షలు ఉంటుంది. మాలలు డీ గ్రూప్ లో చేర్చాలి, అందులోని అభివృద్ధి చెందని వారిని సీ లో ఉంచాలి .

– మాజీ ఎంపీ బి వెంకటేష్ నేత

షమీమ్ అక్తర్ నివేదిక తప్పుల దడకగా ఉంది, అన్యాయం తెలుసుకునేలా తమను జాగృతం చేశారు. గ్రూప్ 3లోని 26 కులాలకు జరిగిన అన్యాయం గమనిస్తే.. 17,71,682 మాలలు 15లక్షలు 27 వేల 143 ఇందులో మెరుగైన అభివృద్ధి పొందిన కులాలు, అభివృద్ధికి నోచుకోకుండా సంచార జీవితం గడుపుతున్న వారూ ఉన్నారు. ఈ విషయమై మంత్రి వర్గ ఉపసంఘం, కమిషన్ ను కలిసి వివరించాం మాల సాలె మెతకాని కులం 1.33లక్షలు +32 =1.65 లక్షలు చూపారు. తెలంగాణలో లేదు, కర్ణాటకలో ఉందంటే కమిషన్ చైర్మన్ ఆశ్చర్యపోయారు. మహర్ 31,938 ఉంది. నేతకానీలు మహర్ సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. నేతకాని, మహర్ ఒకటే అని ఈ సర్టిఫికెట్స్ చెప్తున్నాయి. గ్రూప్ 3లో బలహీనంగా ఉన్న వారిని అందులోనే ఉంది, అభివృద్ధి చెందిన వారిని 4వ గ్రూప్ గా  చేయాలి.

Related posts