Praja Kshetram
తెలంగాణ

దుర్వాసనను భరించలేకపోతున్నాం.

దుర్వాసనను భరించలేకపోతున్నాం.

 

– రోడ్డుపైన జారిపడ్డ మురికి చెత్త.

– నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.

– అధికారులు స్పందించి ఓవర్లోడ్ లారీలను నియంత్రించాలని మంబాపూర్ గ్రామస్తుల డిమాండ్.

పెద్దేముల్ మార్చి 15(ప్రజాక్షేత్రం):మండల పరిధిలోని మంబాపూర్ గ్రామం మీదుగా, సుమారు 50 నుంచి 60 లారీల చెత్తను హైదరాబాద్ లోని దమ్మైగూడ డంపింగ్ యార్డ్ నుంచి తాండూరులోని సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తారు. ఈ క్రమంలో పలుమార్లు మంబాపూర్ గ్రామంలో లారీలనుంచి చెత్త రోడ్డుమీద పడటంతో నిత్యం దుర్వాసనను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంబాపూర్ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం ఉదయం కూడా అధిక బరువుతో చెత్తను తరలిస్తుండగా చెత్త కిందకు జారి నడిరోడ్డు పైన పడింది. దీంతో నిత్యం చౌరస్తాలో వందల మంది బస్సుల కోసం నిలబడే జనాలు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాంబాపూర్ గ్రామ యువకుడు కిరణ్ పేర్కొన్నారు.చెత్త లారీలో నుంచి చెత్త ప్రధాన రోడ్డుపై పడడంతో గ్రామ ప్రజలకు వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది.ఈ విషయాన్ని సంబంధిత అధికారులు పట్టించుకోని లారీల్లో చెత్త తీసుకెళ్లే లారీ డ్రైవర్లకు తగు సూచనలు చేయాలని, చెత్త గ్రామాలలో పడకుండా చెత్తపై టార్పాలిన్ కవర్ కట్టుకొని వెళ్లే విధంగా లారీ డ్రైవర్లకు అధికారులు తక్షణమే తగు సూచనలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts