జూన్ 2 లోగా ఉద్యమకారులను గుర్తించకుంటే మరో పోరాటం:టి యు జె ఏ సి
వలిగొండ మార్చి 28(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన ఉద్యమకారులను జూన్ రెండు లోగా గుర్తించకుంటే తిరుగుబాటు తప్పదని, మరో పోరాటం చేయడానికి టియుజేఏసీ సిద్ధంగా ఉందని టియుజెఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగిశెట్టి క్రిస్టఫర్ అన్నారు. ఆయన గురువారం టియుజేఏసీ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తుండడం హర్షం వ్యక్తం చేస్తూ అదే విధంగా ఉద్యమకారులను కూడా గుర్తించి ఆదుకోవాలని అన్నారు. ఉద్యమకారులు లేనిదే రాష్ట్రం రాలేదని గుర్తించుకోవాలని అన్నారు. ఏప్రిల్ 20, 21, తేదీలలో హైదరాబాదులో ఇంద్ర పార్క్ వద్ద, టియుజేఏసీ మహాసభలు జయప్రదం చేయాలని ఆయన ఉద్యమకారులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు పబ్బు లక్ష్మయ్య, గంగాధరి సత్తయ్య, మంటి లింగయ్య, గంధ మల్ల గోపాలు, తదితరులు పాల్గొన్నారు.