విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు : వెంకయ్య నాయుడు
అమరావతి మార్చి 30(ప్రజాక్షేత్రం):ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నీ ఫ్రీఫ్రీ అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదు. జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెలుగు రాష్ట్రాలను తెచ్చారు. పరిధికి మించి అప్పులు చేస్తే అప్పులూ పుట్టని స్థితికి వస్తారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేతలు పరిస్థితులను గమనించాలి. విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు’ అని సూచించారు.