రావుల పల్లి లో ఘనంగా రంజాన్ వేడుకలు..
శంకర్ పల్లి మార్చి 31(ప్రజాక్షేత్రం):మండలంలోని అన్ని గ్రామాలలో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా నిర్వహించారు. నెల రోజులుగా ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు సోమవారం రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. మండల వ్యాప్తంగా ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపించింది. నూతన వస్త్రాలను ధరించి మసీదులో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. రంజాన్ మాసమంతా కఠిన నియమాలతో ఉపవాస దీక్ష పాటించిన ముస్లిం సోదరులు ఆదివారం నెలవంక కనిపించడంతో సోమవారం రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంజాన్ మాసపు ఉపవాస దీక్షల ప్రార్థనలకు చివరి అంకమే ఈద్- ఉల్-ఫితార్ అని వారు అన్నారు. సోదర భావం, సమానత్వం, సమైక్యత ప్రతి ఒక్కరిలో ఉండాలని వారు అన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.