Praja Kshetram
తెలంగాణ

తండాలో నీటి కోసం తండ్లాట

తండాలో నీటి కోసం తండ్లాట

 

 

ఎల్లారెడ్దిపేట ఏప్రిల్ 01(ప్రజాక్షేత్రం): గుక్కెడు నీటి కోసం తండా ప్రజలు తండ్లడుతున్న అధికారులు వారి పరిస్థితి అర్థం చేసుకోవడం లేదు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలు గా మార్చింది. కానీ కనీస వసతులు కల్పించడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైనప్పటికీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తండాలా వైపు తొంగి చూడటం లేదు. గత ఐదు సంవత్సరాల నుండి గుక్కెడు నీటి కోసం తండా లో ఉన్న ముప్పై కుటుంబాలకు పైగా ప్రతిరోజూ పొలం గట్ల వెంబడి వెళ్లి బోర్ మోటార్ ల ద్వారా తాగునీటిని తెచ్చుకుని దాహార్తిని తీర్చుకుంటున్నారు. గ్రామాల ప్రత్యేకాధికారులు దాహర్తి తీర్చాలని ఆలోచన చేయకపోవడం అధికారుల పనితీరు కు అద్దం పడుతుంది. ఎల్లారెడ్డిపేట మండలం పోచమ్మ తండాలో సుమారు 30 కి పైగా కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇక్కడి తండా ప్రజలు తాగే నీళ్ల కోసం తండ్లడుతూ ప్రతి రోజూ ఉదయం వేకువ జామున లేచి బోర్ మోటార్ లు స్టార్ట్ చేసుకుని పొలం గట్ల వెంబడి నడుచుకుంటూ వెళ్లి దాహర్తి తీర్చుకుంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో బోర్ వేసి మంచి నీటి సౌకర్యం కల్పించాలని అప్పటి పాలక వర్గాన్ని కోరిన పట్టించుకోలేదని తండా ప్రజలు ఆరోపిస్తున్నారు. పొలం గట్ల వెంబడి బిందెల తో నీటిని తెచ్చుకోవడంతో పలువురు మహిళలకు గాయాలు అయ్యాయని, ఇద్దరు మహిళల కాళ్ళు కూడా విరిగాయని తండా ప్రజలు దిశ తో అన్నారు.

– బోర్ ఎండిపోయింది

మిషన్ భగీరథ నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని, ఆదే విధంగా నల్లాలు కూడా రిపేర్ చేయడం జరిగిందని, గతంలో తండాలో వేసిన బోర్ ఎండిపోయిందని మరో బోర్ వేయడానికి అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామని పంచాయతీ కార్యదర్శి దేవరాజు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలని తండా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Related posts