Praja Kshetram
తెలంగాణ

సీపీఐ(ఎం) తెలంగాణ కీలక నిర్ణయం

సీపీఐ(ఎం) తెలంగాణ కీలక నిర్ణయం

 

 

తెలంగాణ బ్యూరో ఏప్రిల్ 01(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూముల వేలం ఆపాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్చేశారు. ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా బుధవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆందోళనలో పోలీసుల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకే చెందాలని, భవిష్యత్‌ తరాలకు అవసరమని ఆందోళన చేస్తుంటే వారి మీద అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈ ఘటనలో నవీన్‌ అనే ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థిని, మరో విద్యార్థిని జైలుకు పంపించారని, మిగతా విద్యార్థులను అరెస్టులు చేస్తున్నారని ఇదెక్కడి న్యాయం అని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. ఇప్పటికైనా 400 ఎకరాల భూమి వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, అక్కడ 144 సెక్షన్‌ , విద్యార్థుల మీద నమోదు చేసిన అక్రమ కేసులు రద్దు చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాపితంగా సీపీఐ(ఎం) నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసినటువంటి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ తమ నిరనసనలు కొనసాగుతాయని జాన్వెస్లీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు, ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యం కొనసాగుతుందని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాము నిరసన చేస్తే కూడా తట్టుకోలేక పోతున్నారన్నారు. పోలీస్‌ నిర్బంధాన్ని పెంచడం, అరెస్టులు చేయడం, అరాచకాలకు పాల్పడడం సరికాదని ఈ చర్యలను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తున్నదని జాన్వెస్లీ అన్నారు.

Related posts