Praja Kshetram
తెలంగాణ

సన్న బియ్యం పథకానికి సూపర్ రెస్పాన్స్.. రేషన్ షాపుల వద్ద జనం క్యూ

సన్న బియ్యం పథకానికి సూపర్ రెస్పాన్స్.. రేషన్ షాపుల వద్ద జనం క్యూ

 

 

తెలంగాణ బ్యూరో ఏప్రిల్ 06(ప్రజాక్షేత్రం):రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన సన్న బియ్యం పథకం ప్రజాదరణ పొందుతుంది. రేషన్దుకాణాల్లో సన్నబియ్యం తీసుకునేందుకు లబ్దిదారులు క్యూ కడుతున్నారు. ఉగాది పండుగ రోజున సీఎం రేవంత్రెడ్డి హూజూర్నగర్నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈనెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్షాపుల్లో డీలర్లు రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. మొన్నటి వరకు రేషన్దుకాణాల వైపు చూడని వారంతా సన్నబియ్యం పంపిణీ మొదలు కాగానే ఆగమేఘాల మీద పరుగులు పెట్టకుంటూ వస్తున్నారు. డీలర్లు రోజంతా దుకాణంలో ఉంటూ అర్హులైన వారందరికీ అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షలకు పైగా కార్డులు ఉండగా 3.10 కోట్ల మంది లబ్దిదారులకు సన్నబియ్యం ఇస్తుంది. నెలకు 2 లక్షల మెట్రిక్టన్నులు బియ్యం రేషన్దుకాణాలకు సరఫరా చేసింది. ఒకటి, రెండు నెలల్లో మరో 30లక్షల మంది లబ్దిదారులు పెరిగే అవకాశం ఉంది.

– ఇప్పటికే సగం కోటా ఖాళీ

సన్నబియ్యం పంపిణీ చేసినప్పటికి ఇప్పటివరకు సగం కోటా ఖాళీ అయిందని, ఈనెల 10లోగా పూర్తికావచ్చని డీలర్లు భావిస్తున్నారు. మరో విడత బియ్యం తీసుకురావాల్సి వస్తుందని, గతంలో ఉన్న కార్డులో 60 శాతం మంది తీసుకునే వారిని ఇప్పుడు వంద శాతం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తాము బియ్యం పంపిణీ చేసేందుకు సహాయకులను పెట్టుకునే పరిస్థితి వచ్చిందని, దీంతో పీడీఎస్రైస్బ్లాక్మార్కెట్కు తరలించే వీలు లేదని చెప్పారు. సన్నబియ్యం పంపిణీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 10,655 కోట్లు ఖర్చు పెడుతుండగా అందులో రాష్ట్రం వాటా రూ. 5,175 కోట్లు కాగా కేంద్రం వాటా రూ. 5,485 కోట్లు ఉంది. సన్న బియ్యం పంపిణీతో రాష్ట్ర సర్కారుపై అదనంగా రూ. 2,858 కోట్ల భారం పడనుంది.

– ఇతర సరుకుల పంపిణీకి ప్రయత్నాలు.

ప్రభుత్వం రేషన్దుకాణాల్లో కేవలం సన్న బియ్యంతో సరిపెట్టకుండా ఇతర నిత్యావసర సరుకులను కూడా ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా అందించనుంది. వాటికి సంబంధించి ప్రాతిపదనలు కూడా సిద్దం చేసినట్లు చేస్తోంది. ఉమ్మడి పాలనలో సీఎం కిరణ్కుమార్రెడ్డి రేషన్దుకాణాల ద్వారా 15 రకాలు సరుకులు పంపిణీ చేసేవారు. అదే తరహాలో ముందుగా సబ్బులు, పసుపు, కారం, నూనెలు, గోధుమలు వంటి 5 రకాలు జూన్నుంచి అందజేయనున్నారు.

– సామూహిక భోజనాల కార్యక్రమం

సన్న బియ్యం పంపిణీ ప్రజల్లో విస్తృతం ప్రచారం జరిగేందుకు ప్రభుత్వం సామూహిక భోజనాలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇప్పటికే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తన నియోజకవర్గంలో ఒక ఇంటికి వెళ్లి సన్న బియ్యం భోజనం చేశారు. అదే విధంగా సీఎం రేవంత్రెడ్డి ఖమ్మంలో భోజనం చేయనున్నారు. తరువాత ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా చేపట్టనున్నారు. వీరికంటే తామేమి తక్కువ కాదని కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్సన్న బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని, బీజేపీ కార్యకర్తలు లబ్దిదారుల ఇంటికి వెళ్లి భోజనం చేయాలని పిలుపునిచ్చారు.

Related posts