Praja Kshetram
తెలంగాణ

పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ప్రజలతో కలిసి పని చేస్తా : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ప్రజలతో కలిసి పని చేస్తా : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

 

పెద్దేముల్ ఏప్రిల్ 12(ప్రజాక్షేత్రం):పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉన్న ఎమ్మెల్యే, మంత్రులతో కలిసి గ్రామాలు అభివృద్ధి చెందేందుకు అన్ని పార్టీ వర్గాలను కలుపుకుని పనిచేసి గ్రామాలను అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తానని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్, నర్సాపూర్, గాజీపూర్ గ్రామాలలో ఎంపీ విధులతో సీసీ రోడ్లు శంకుస్థాపన, అభివృద్ధి పనులను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత, బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు,రాజశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ అంతారం లలిత, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. పల్లె నుంచి పట్నం వరకు అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం నిధుల నిధులు ఉన్నాయని అన్నారు. కార్యకర్తలు పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసే పనులను ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలిసేలా వివరించాలన్నారు. అలా చేయడం వల్ల రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో భాజపా నుంచే గెలిపించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ వీరప్ప,జిల్లా కార్యవర్గ సభ్యులు హరీష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు వీరేశం, ప్రధాన కార్యదర్శి రామచందర్, యాదయ్య, తడకల శ్రీనివాస్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఉప్పరి రవి, ఉప్పరి వీరేశం, మల్లేశం, సంగమేశ్వర్,శివరాజ్, నరసింహ భూమా, పరశురాం, కృష్ణ, అంజి, వివిధ గ్రామాల కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts