Praja Kshetram
తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎలాంటి షూరిటీ లేకుండా 20 లక్షల రుణం

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎలాంటి షూరిటీ లేకుండా 20 లక్షల రుణం

 

 

నేషనల్ బ్యూరో ఏప్రిల్ 12(ప్రజాక్షేత్రం):ఎలాంటి గ్యారెంటీ లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు రుణాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ముద్ర యోజన పి ఎం ఎం వై పథకాన్ని అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పథకంలో గత ఏడాది తరుణ్ ప్లస్ విభాగాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా 20 లక్షల వరకు లోన్ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే ఈ తరుణ్ ప్లస్ విభాగం ప్రారంభించిన కేవలం నాలుగు నెలల్లోనే ఏకంగా 25 వేల మందికి ఇప్పటివరకు రుణాలను మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ఇప్పటివరకు అనేక రకాల పథకాలను అమలు చేసింది. ఈ పథకాలలో అత్యంత ఆదరణ పొందిన పథకం ప్రధానమంత్రి ముద్ర యోజన. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గత ఏడాది జులై 2024లో ఎక్కువ మొత్తంలో రుణాలు అవసరమైన వారికి ఉపయోగపడేలాగా వార్షిక బడ్జెట్లో ఒక కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రధానమంత్రి ముద్ర యోజనకు చెందిన తరుణ్ ప్లస్ విభాగం కింద రుణాల పరిమితిని రెట్టింపు చేసి 20 లక్షలకు పెంచినట్లు తెలిపారు. బడ్జెట్ పూర్తయిన తర్వాత తరుణ్ ప్లేస్ పథకాన్ని అక్టోబర్ 25, 2024 నోటిఫై చేయడం జరిగింది. ప్రధానమంత్రి ముద్ర యోజన తరుణ్ ప్లస్ విభాగం నోటిఫై చేసిన కేవలం నాలుగు నెలల లోనే 25వేల మందికి రుణాలను మంజూరు చేయడం విశేషం. 2024-25 లో నాలుగు నెలల్లోనే ఈ ఘనత అందుకున్నట్లు ఆర్థిక సేవలో విభాగం కార్యదర్శి ఎం నాగరాజు చెప్పుకొచ్చారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలో రూ. 3790 కోట్ల నిధులను 24,557 మందికి కొత్త రుణ వినియోగదారులకు అందించినట్లు చెప్పుకొచ్చారు.

Related posts