Praja Kshetram
జాతీయం

రీల్స్ కోసం రిస్క్.. గంగా నదిలో కొట్టుకుపోయిన యువతి

రీల్స్ కోసం రిస్క్.. గంగా నదిలో కొట్టుకుపోయిన యువతి

 

 

ప్రజాక్షేత్రం డెస్క్: రీల్స్, సెల్ఫీల పిచ్చితో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం తరుచు ఎక్కడో ఒక చోట రీల్స్ కోసమో..సెల్ఫీల కోసమో లేక లైక్ ల కోసం సాహసోపేత పనులు చేసి యువతీ యువకులు ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సరిగ్గా అలాంటి ఘటనే ఓ యువతి ప్రాణాలు తీసింది. ఓ యువతి గంగా నదిలో రీల్ చేసేందుకు యత్నించి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. యూపీ ఉత్తరకాశీలో మణికర్ణిక ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీల్ చేసే ప్రయత్నంతో నదిలో కొట్టుకపోయి గల్లంతైన యువతి ఆచూకీ కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఇకపోతే మరో యువతి కూడా సోషల్ మీడియా ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకునే క్రమంలో రైలు పక్కన ట్రాక్ ల మధ్య పరుగులు తీసింది. ఢిల్లీకి చెందిన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ వేగంగా వెలుతున్న రైలు పక్కన పరిగెత్తింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు, కొంతమంది ఆమె తన ఫిట్నెస్ నిరూపించుకున్న తీరును ప్రశంసించగా, మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts