Praja Kshetram
తెలంగాణ

గెట్ రెడీ.. మరికొన్ని గంట్లో ఇంటర్ రిజల్ట్స్..

గెట్ రెడీ.. మరికొన్ని గంట్లో ఇంటర్ రిజల్ట్స్..

 

హైదరాబాద్ ఏప్రిల్ 21(ప్రజాక్షేత్రం):తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు(మంగళవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఫస్ట్ ఇయర్‌తో పాటు సెకండియర్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొననున్నారు. ఇక, మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన పరీక్షలకు 9.5 లక్షల మందికి పైగా హాజరయ్యారు. రేపు వీరి భవిష్యత్తు తేలనుంది.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..

1) ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి.

2 ) ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ ట్యాబుపై క్లిక్ చేయండి.

3) మీ హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.

4) ఫలితాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.

5) వాటిని ప్రింట్ తీసుకోవచ్చు.

Related posts