Praja Kshetram
తెలంగాణ

డోలీలో ఆరు కిలోమీటర్లు !

డోలీలో ఆరు కిలోమీటర్లు !

 

– వైద్యం కోసం గిరిజనుల పాట్లు

రోలుగుంట ఏప్రిల్ 26(ప్రజాక్షేత్రం):అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ కొండ శిఖర గ్రామమైన నీలబంద పివిటిజి కొందు గిరిజన గ్రామానికి చెందిన బాలుడు గెమ్మెల సింహాద్రికి శరీరం మొత్తం కురుపులు రావడంతో ధర్మవరంలోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు శనివారం కుటుంబీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో గ్రామం నుంచి ఆరు కిలోమీటర్లు మేర నడక సాగిస్తూ ఎత్తెన కొండలు ఎక్కి దిగుతూ డోలీ మోతతో సింహాద్రిని రావికమతం మండలం కుంజుర్తి గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆటోలో ధర్మవరంలోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ పివిటిజి గ్రామానికి నేటికీ ఆశా కార్యకర్త లేరు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తినా, ఇతర అవసరాలు తీర్చుకోవాలన్నా డోలీ మోతలే శరణ్యమవుతున్నాయి. తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలని, గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు గెమ్మెలి చిన్నా, గెమ్మెలి అప్పారావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.గోవిందరావు కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే డోలీ మోతలతో నిరసన చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.

Related posts